Advertisementt

అమెజాన్ ప్రైమ్ లో బొంబాట్!

Tue 01st Dec 2020 06:43 PM
bombhaat movie,bombhaat,amazon prime  అమెజాన్ ప్రైమ్ లో బొంబాట్!
Bombhaat Movie in Amazon Prime అమెజాన్ ప్రైమ్ లో బొంబాట్!
Advertisement
Ads by CJ

అమెజాన్ ప్రైమ్ తో డిసెంబర్ 3 న విడుదల అవుతుంటున్న రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం బొంబాట్

కె రాఘవేంద్ర రావు గారి సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం పై సుశాంత్, చాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి ముఖ్య తారాగణం తో రాఘవేంద్ర వర్మ దర్శకత్వం లో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మిస్తున్న  రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం బొంబాట్. ఈ చిత్రం డిసెంబర్ 3 వ తారికున్న అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యేకంగా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా 

దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ సరికొత్త కథ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వస్తున్నా చిత్రం బొంబాట్. నా కథను నిమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ గారికి ధన్యవాదాలు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు మా సినిమా స్క్రిప్ట్ దశ నుంచి మాతో ఉంది మమ్మల్ని వెనకుండి నడిపించారు. అయన సినిమా చూసి చాలా బాగుంది అని సూపర్ హిట్ అవుతుంది అని కొనియాడారు. బొంబాట్ చిత్రం ఒక రోబోటిక్ కథ కథనం తో వస్తుంది. చాలా కొత్త గా ఉంటుంది. ఈ చిత్రాన్ని కేవలం 38 రోజుల్లో హైదరాబాద్ పరిసరప్రాంతాలో చిత్రీకరించాం. మా చిత్రంలో మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది. మా చిత్రానికి  జోష్ బి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శిని తన పంచ్ డైలాగులతో వినోదాన్ని రేటింపు చేస్తారు. మా సినిమా 2020 డిసెంబర్ 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది అని తెలిపారు. 

నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ మాట్లాడుతూ నాకు కథ చాలా బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకి ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. మా సినిమా చూసి మెచ్చుకున్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారికి ధన్యవాదాలు. అయన సలహాలు సూచనలు మా సినిమా కి చాలా ఉపయోగబడాయి. తెలుగు ప్రేక్షకులకి మంచి సినిమా అందించాలి అని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించాం. మా బొంబాట్ సినిమా 2020 డిసెంబర్ 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. అందరికి నచుతుంది, తప్పక చుడండి అని తెలిపారు. 

నటి నటులు : సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి, మకరంద్ దేశ్ పాండే, ప్రియదర్శిని, తనికెళ్ళ భరణి, శిషీర్ శర్మ, వినీత్ కుమార్, హేమ, తదితరులు 

Bombhaat Movie in Amazon Prime:

Bombhaat Movie in Amazon Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ