Advertisementt

రానా, సాయిప‌ల్ల‌వి మళ్ళీ 'విరాట‌ప‌ర్వం' లోకి!

Tue 01st Dec 2020 01:38 PM
virataparvam movie,rana,sai pallavi  రానా, సాయిప‌ల్ల‌వి మళ్ళీ 'విరాట‌ప‌ర్వం' లోకి!
Rana’s Virataparvam Shooting Resumes రానా, సాయిప‌ల్ల‌వి మళ్ళీ 'విరాట‌ప‌ర్వం' లోకి!
Advertisement
Ads by CJ

రానా 'విరాట‌ప‌ర్వం' షూటింగ్ పునఃప్రారంభం

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'విరాటప‌ర్వం'. 'నీది నాది ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం హిస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్పిస్తుండ‌గా, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక చిన్న షెడ్యూల్ మిన‌హా 'విరాట‌ప‌ర్వం' షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. మిగిలిన పోర్ష‌న్‌కు సంబంధించి ఇటీవ‌లే షూటింగ్ పునఃప్రారంభ‌మైంది. రాత్రిపూట స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రానా కూడా పాల్గొంటున్నారు.

ఒక విభిన్న త‌ర‌హాతో, కంటెంట్ ప్ర‌ధానంగా రూపొందుతున్న 'విరాట‌ప‌ర్వం'లో ఇప్ప‌టివ‌ర‌కూ తాము పోషించ‌ని త‌ర‌హా పాత్ర‌ల‌ను రానా, సాయిప‌ల్ల‌వి పోషిస్తున్నారు. ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్ర‌ధారులైన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం: రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావు, సాయిచంద్, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీ ప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి,

సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌, మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ‌నాగేంద్ర‌, స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌, కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌, నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి, బ్యాన‌ర్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్‌, స‌మ‌ర్ప‌ణ‌: డి. సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ కుమార్ చాగంటి, సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌,  దివాక‌ర్ మ‌ణి.

Rana’s Virataparvam Shooting Resumes:

Rana resumes shooting for 'Virataparvam' Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ