Advertisementt

'బ‌జార్ రౌడి' స్టెప్పులు

Mon 30th Nov 2020 07:39 PM
bazaar rowdy movie,sampoornesh babu  'బ‌జార్ రౌడి' స్టెప్పులు
Prem Rakshit steps out with 'Bazaar Rowdy' 'బ‌జార్ రౌడి' స్టెప్పులు
Advertisement
Ads by CJ

'బ‌జార్ రౌడి' తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌, ఆయ‌న న్యూస్ సోష‌ల్ మీడియా లో స‌న్సేష‌న్.. ఆయ‌న డాన్స్ యూత్ కి వైబ్రేష‌న్, ఆయ‌న సినిమా ఫ్యాన్స్ కి సెల‌బ్రేష‌న్

ఒన్ అండ్ ఓన్లీ బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమా అప్‌డేట్ అంటే యావ‌త్ తెలుగు సినిమా షెక్ అవ్వాల్సిందే. ఆయ‌న న‌టించిన‌ చిత్రాలు హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్‌డూప‌ర్ హిట్  అయ్యి సంపూర్ణేష్ బాబు స‌త్తా ని టాలీవుడ్ మెత్తం చాటింపువేశాయి. లాక్‌డౌన్ త‌రువాత బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి బ‌జార్ రౌడి అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న చిత్రానికి ద‌ర్శ‌కుడు వసంత నాగేశ్వ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. కె ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో రూపోందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మ‌హి న‌టిస్తుంది. పాట‌ల్లో సంపూర్ణేష్ బాబు డాన్స్ ల‌కి ఆయ‌న వేసే స్టెప్స్‌కి వున్న క్రేజ్ చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ క్రేజ్ ని ఇప్పుడు బ‌జార్ రౌడి టీం డ‌బల్ చేస్తున్నారు. ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు, య‌మ‌దోంగ‌,ప‌రుగు, మ‌గ‌ధీర‌,ఆర్య‌-2, డార్లింగ్‌, సింహ‌, మ‌ర్యాద‌రామ‌న్న‌, 100% ల‌వ్‌, బృందావ‌నం, కందిరీగ‌, పూల‌రంగ‌డు, ఇష్క్‌, ర‌చ్చ‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, భాహుబ‌లి-1, భాహుబ‌లి-2, రంగ‌స్థ‌లం  లాంటి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ కే కాకుండా త‌మిళం లో మార్ష‌ల్‌, వీరం,శ‌గుని,వేలాయుదం, లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కి సూప‌ర్‌స్టార్స్ కి కొరియోగ్ర‌ఫి అందించిన ట్రెండ్‌సెట్టింగ్ కొరియెగ్రాఫ‌ర్ మాస్ట‌ర్ ప్రేమ్‌ర‌క్షిత్ ఈ బ‌జార్ రౌడి తో స్టెప్స్ వెయిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ షూటింగ్ రామెజిఫిల్మ్ సిటి లో జ‌రుగుతుంది.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు వ‌సంతి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ఎంతో బిజిగా వుండి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్స్ కి కొరియోగ్రాఫర్ గా ప‌నిచేసి ఆ చిత్రాల గ్రాఫ్ ని మార్చేసిన ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్ మా చిత్రం లో మా బ‌జార్ రౌడి తో స్టెప్స్ వెయించి మా చిత్రం గ్రాఫ్ ని మార్చినందుకు ఆయ‌న‌కి హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఈ సాంగ్ ప్ర‌స్తుతం రామెజి ఫిల్మ్‌సిటి లో 20 మంది డాన్స్‌ర్స్ తో హీరో సంపూర్ణేష్ బాబు, మ‌హి ల పై చిత్రీక‌రిస్తున్నాము. ఈ చిత్రానికి సంబందించిన టాకి పూర్తిచేసాము. త్వ‌ర‌లో క్లైమాక్స్ మ‌రియు మ‌రో రెండు సాంగ్స్ తో షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ చిత్రానికి బ‌జార్ రౌడి అనే టైటిల్ అనుకున్న వెంట‌నే మా యూనిట్ అంద‌రి ద‌గ్గ‌ర‌నుండి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం మాలో కొత్త ఎనర్జి వ‌చ్చింది. మా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు గారు బ‌డ్జెట్ విష‌యం లో ఎక్క‌డా లిమిటేష‌న్ పెట్ట‌కుండా చిత్రాన్ని నిర్మిస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ శేఖ‌ర్ గారు త‌న అనుభ‌వం తో ఎక్క‌డ ఖ‌ర్చుపెడితే స్క్రీన్ మీద క‌న‌బ‌డుతుందో చ‌క్క‌టి ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తు్న్నారు. ఈ చిత్రం లో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో షియాజి షిండే, థ‌ర్ఠి ఇయ‌ర్స్ పృథ్వి, నాగినీడు,ష‌ఫి, జీవ‌, స‌మీర్‌, మ‌నిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి లాంటి భారీతారాగాణం తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెద‌టి లుక్‌, టీజ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం..అన్నారు.

న‌టీన‌టులు.. బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు. మ‌హి, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్ , ఎస్ వి ఎస్ నాయుడు త‌దిత‌రులు.. మాట‌లు.. మ‌రుధూరి రాజా, డి ఓ పి.. ఏ విజ‌య్ కుమార్‌, సంగీతం.. సాయికార్తిక్‌, ఫైట్ మాస్ట‌ర్‌.. జాషువా, కాస్ట్యూమ్స్‌.. ప్ర‌సాద్‌, మేక‌ప్‌..శ్రీకాంత్‌, కొ-డైర‌క్ట‌ర్‌.. కె.శ్రీనివాస‌రావు, పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి, నిర్మాత‌.. సందిరెడ్డి శ్రీనివాస‌రావు. ద‌ర్శ‌క‌త్వం.. వసంత నాగేశ్వ‌రావు.

Prem Rakshit steps out with 'Bazaar Rowdy' :

Sampoornesh Babu Movie 'Bazaar Rowdy' Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ