మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ద ఫాదర్ ఆఫ్ OTT’
తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గారికి ఉన్న ఇమేజ్ గురించి కానీ.. ప్రత్యేకత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్లానింగ్ అంటే అలా ఉంటుంది మరి. ఇప్పటి వరకు ఈయన నిర్మించిన సినిమాల్లో దాదాపు 90 శాతం విజయాలున్నాయంటే అల్లు అరవింద్ గారి జడ్జిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఈయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వేల మందికి ఉపాదిని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఇండస్ట్రీ అంతా స్థంభించిపోతే అల్లు అరవింద్ గారు మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఎంతోమంది సినీ కార్మికులకు లాభం చేకూర్చారు. ఆహా ఓటిటి సంస్థను స్థాపించి అందులో తెలుగు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో ఆహాను 100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అంటే కొంతమంది నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నవ్విన వాళ్లతోనే ఆహా అనిపిస్తున్నారు అల్లు అరవింద్.
లాక్‌డౌన్ సమయంలో ఆహా తీసుకున్నన్ని కొత్త సినిమాలు.. కంటెంట్ మరే ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో, భానుమతి రామకృష్ణ, జోహార్ లాంటి చాలా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించారు అల్లు అరవింద్ గారు. మరోవైపు ఆహా కంటెంట్‌తో పాటు లాక్‌డౌన్ సమయంలోనే హీరోల డేట్స్ తీసుకుని ఆరు సినిమాలకు శ్రీకారం చుట్టారు. అందులో కార్తికేయ చావు కబురు చల్లగా.. నిఖిల్ 18 పేజెస్.. అల్లు శిరీష్ సినిమా.. వరుణ్ తేజ్ సినిమా.. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి సినిమాలను ఈయన నిర్మిస్తున్నారు. ఓ వైపు ఈ క్రేజీ సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూనే ఆహా కంటెంట్ కూడా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు ఈయన. ఓ సినిమా కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 180 మంది పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళంతా లాక్ డౌన్ సమయంలో పని లేకుండా ఉండిపోయారు. మరోవైపు థియేటర్స్ మూత పడి ఉండటంతో వాళ్లు తెరకెక్కించిన సినిమాలను కూడా ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో తెలియక ఉండిపోయిన చాలా సినిమాలను ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా విడుదల చేసారు అల్లు అరవింద్.
ఇదంతా ఆయన ఎందుకు చేసారు అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే.. ఎంతోమంది ఎన్నో కోట్ల ఆశలతో మంచి సినిమాలు చేసి.. చేతిలోనే ఉంచుకుని విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు సాయం చేయడానికే అల్లు అరవింద్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రయత్నం వందశాతం కాదు 200 శాతం సక్సెస్ అయింది. ఇప్పుడు అల్లు అరవింద్ గారిని టాలీవుడ్‌లో ఫాదర్ ఆఫ్ ఓటిటిగా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఏం ఓటిటి అన్నవాళ్లే ఇప్పుడు ఆహా ఓటిటి అంటున్నారు. ఇదంతా చూస్తుంటే అనుభవం అనేది ఓ నిర్మాతకు ఎంత అవసరమో అర్థమవుతుంది. ఈ తరం నిర్మాతలకే కాదు ఎంతోమందికి అల్లు అరవింద్ గారు తన నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. చాలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే చేయలేని పనిని ఈయన సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు.