Advertisementt

అరకులో సందడి చేస్తున్న 'గాలి సంపత్'.

Sat 28th Nov 2020 01:35 PM
gaali sampath movie,sampath nandi,presented by anil ravipudi,producer s. krishna,director anish,gaali sampath movie  అరకులో సందడి చేస్తున్న 'గాలి సంపత్'.
Gaali Sampath' Shoot Is Progressing At Araku అరకులో సందడి చేస్తున్న 'గాలి సంపత్'.
Advertisement
Ads by CJ

అరకులో సందడి చేస్తున్న 'గాలి సంపత్'.

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న 'గాలి సంప‌త్' ను  అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించి షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం అనీష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది.

'గాలి సంపత్' ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణు తో పాటూ సినిమాలో ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమా మీద మంచి అంచనాలుక్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో బ్యూటిఫుల్ జ‌ర్నీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌, స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి, ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌, సంగీతం: అచ్చు రాజ‌మ‌ణి, ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌, మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, లిరిక్స్‌: రామ‌జోగ‌య్య, ఫైట్స్‌: న‌భ‌, కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను, మేక‌ప్‌: ర‌ంజిత్‌, కాస్టూమ్స్‌: వాసు, చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌. నిర్మాణం: షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, సమ‌ర్ప‌ణ‌: అనిల్ రావిపూడి, నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: అనీష్

Gaali Sampath' Shoot Is Progressing At Araku:

The film opens as a Beautiful Journey with Entertainment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ