Advertisementt

యాక్ష‌న్ హీరో విశాల్‌కి హీరో ఆర్య 'ఎనిమీ'

Fri 27th Nov 2020 09:37 PM
enemy movie,vishal,arya,multistarrer,enemy movie  యాక్ష‌న్ హీరో విశాల్‌కి హీరో ఆర్య 'ఎనిమీ'
Vishal and Arya's massive multistarrer 'Enemy' యాక్ష‌న్ హీరో విశాల్‌కి హీరో ఆర్య 'ఎనిమీ'
Advertisement
Ads by CJ

యాక్ష‌న్ హీరో విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఎనిమీ'

ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాలా రూపొందించిన `వాడు-వీడు` సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్ద‌రు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి మ‌రో భారీ చిత్రంలో క‌లిసి నటిస్తున్నారు.  ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి 'ఎనిమీ' అనే పేరును అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్.  ఇది యాక్ష‌న్ హీరో విశాల్ కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ ప‌తాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రంలో విల‌క్షణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన మృణాళిని ర‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ ‌డి రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. వీలైనంత త్వరగా  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది చిత్రయూనిట్.

యాక్ష‌న్ హీరో విశాల్, ఆర్య, మృణాళిని ర‌వి, ప్రకాశరాజ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి. ఆర్ డి రాజశేఖర్, సంగీతం: తమన్ ఎస్ ఎస్, ఆర్ట్: టి. రామలింగం, ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా, యాక్షన్ రవివర్మ, నిర్మాత: వినోద్ కుమార్, దర్శకత్వం: ఆనంద్ శంక‌ర్‌.

Vishal and Arya's massive multistarrer 'Enemy':

This is Vishal's 30th film and Arya's 32nd.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ