వంగవీటి, జార్జిరెడ్డి వంటి బయోపిక్ లతో ప్రేక్షకులను అలరించిన సందీప్ మాధవ్ ఈసారి ఒక సరికొత్త రొమాంటిక్ మాస్ ఎంటెర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. హల్సియన్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా ఒక చిత్రం రాబోతుంది. చిత్ర పరిశ్రమలో అనేక భారీ సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ పని చేసిన DOP అరుణ్ కుమార్ సురపనేని నిర్మాతగా మారి ఈ చిత్రం నిర్మిచనున్నారు. ఈ చిత్రంతో జెవి.మధు కిరణ్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నారు. ఈయన గతం లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) చిత్రాలతో పాటు అనేక చిత్రాలకు రచయితగా పని చేసారు. సరికొత్త రొమాంటిక్ మాస్ ఎంటెర్టైనర్ ఎలిమెంట్స్ రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో ప్రముఖ నటుడు నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జూబ్లీ హిల్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంబించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర నిర్మాత అరుణ్ కుమార్ సురపనేని తెలియచేశారు.