Advertisementt

పుష్పరాజ్ కి మొగుడు వస్తున్నాడు!

Wed 25th Nov 2020 07:58 PM
allu arjun,pushpa movie,pan india movie,sukumar,villain vikram,pan india craze  పుష్పరాజ్ కి మొగుడు వస్తున్నాడు!
Pushpa Movie team Approached Chiyaan Vikram? పుష్పరాజ్ కి మొగుడు వస్తున్నాడు!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా మూవీ కి ఇంకా సుకుమార్ విలన్ ని ఫైనల్ చెయ్యలేదు. అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ ఓ హీరో అయ్యుండాలి.. ఆ నటుడికి పాన్ ఇండియాలో క్రేజ్ రావాలనే యోచనలో సుకుమార్ ఇంతవరకు పుష్ప విలన్ వేటలోనే ఉండిపోయాడు. విజయ్ సేతుపతి అయితే పాన్ ఇండియాకి సరిపోయే విలన్ పాత్ర అనుకుంటే.. విజయ్ సేతుపతి పుష్ప నుండి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దానితో సుకుమార్ కి పుష్ప విలన్ కష్టాలు ఎక్కువయ్యాయి.

అయితే మధ్యలో మాధవన్, ఆర్య పేర్లు వినిపించినా.. తాజాగా పుష్ప రాజ్ కి తగ్గ మొగుడు దొరికాడనే టాక్ వినబడుతుంది. అంటే అల్లు అర్జున్ కి సరిపోయే విలన్ దొరికేసాడట. అది తమిళనాట టాప్ హీరోగా కొనసాగి.. కొంతకాలంగా ప్లాప్ సినిమాలు చేస్తున్న ప్రయోగాల హీరో విక్రమ్.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ అంటూ ప్రచారం మొదలయ్యింది. సుక్కు అండ్ అల్లు అర్జున్ లు విక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. అయితే పుష్ప విలన్ పాత్ర నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో విక్రమ్ కూడా సుక్కు ఆఫర్ ని కాదనలేకపోయాయాడని సోషల్ మీడియా టాక్.

అదే నిజమైతే పుష్ప సినిమాకి భీభత్సమైన క్రేజ్ రావడం ఖాయం. మరి రకరకాల ప్రయోగాలతో విక్రమ్ ఇప్పటికి స్టార్ హీరో క్రేజ్ ని నిలబెట్టుకుంటున్న హీరో. హీరోగా వరస ప్లాప్స్ ఉన్నా.. విక్రమ్ సినిమా అనగానే అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. మరి పుష్ప విలన్ గా విక్రమ్ అంటే పుష్ప కి అంచనాలు పెగడం ఖాయమే. విక్రమ్ పుష్ప విలన్ అనే క్లారిటీ త్వరలోనే వస్తుంది అని అంటున్నారు. 

Pushpa Movie team Approached Chiyaan Vikram?:

Vikram to join Hands With Allu Arjun For Pushpa Movie?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ