డాక్టర్ మోహన్‌బాబు చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా' హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో డాక్టర్ మోహన్‌బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు. మొదట తిరుపతి షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసింది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. ఈరోజు బుధవారం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను ప్రారంభించారు. ప్రధాన తారాగణంపై అధిక భాగం సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు.
మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం. మోహన్‌బాబును ఆమె పూర్తిగా సరికొత్త రూపంలో చూపిస్తున్నారు.
మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా చిన్నా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం: బ్యానర్స్: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మ్యూజిక్: మేస్ట్రో ఇళయరాజా, డీఓపీ: సర్వేష్ మురారి, డైలాగ్స్: తోటపల్లి సాయినాథ్, స్టైలిస్ట్ (డాక్టర్ మోహన్‌బాబు): విరానికా మంచు, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, ఆర్ట్: చిన్నా, ఎడిటింట్: గౌతంరాజు, పీఆర్వో: వంశీ-శేఖర్, కథ-దర్శకత్వం: డైమండ్ రత్నబాబు, స్క్రీన్‌ప్లే: డాక్టర్ ఎం. మోహన్‌బాబు, నిర్మాత: విష్ణు మంచు.