Advertisementt

గోపీచంద్, సంప‌త్ నంది చివర్లో ‘సీటీమార్‌’

Tue 24th Nov 2020 05:25 PM
seetimaarr movie,gopichand,sampath nandi,producer srinivasaa chhitturi,seeti maarr movie,  గోపీచంద్, సంప‌త్ నంది చివర్లో ‘సీటీమార్‌’
'Seetimaarr' Movie Final Schedule గోపీచంద్, సంప‌త్ నంది చివర్లో ‘సీటీమార్‌’
Advertisement
Ads by CJ

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది ‘సీటీమార్‌’ చివ‌రి షెడ్యూల్ ప్రారంభం.

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’ ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా కోసం ప్రొడ‌క్ష‌న్ టీం స్పెష‌ల్ గా వేసిన భారీ సెట్ లో చేస్తున్న‌ ఏర్పాట్ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేశారు. అవ‌స‌ర‌మైన అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జ‌రిపి చిత్రీక‌ర‌ణ పూర్తిచేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.  

ఇప్ప‌టికే  ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

Click Here: Seetimaarr Working Photos

'Seetimaarr' Movie Final Schedule:

Gopichand, Sampath Nandi's 'Seetimaarr' Commences It's Final Schedule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ