Advertisementt

'ఢీ' సీక్వెల్ 'డి&డి' టైటిల్ పోస్ట‌ర్

Mon 23rd Nov 2020 03:04 PM
vishnu manchu,sreenu vaitla,d & d movie   'ఢీ' సీక్వెల్ 'డి&డి' టైటిల్ పోస్ట‌ర్
D&D Announced With Title Poster 'ఢీ' సీక్వెల్ 'డి&డి' టైటిల్ పోస్ట‌ర్
Advertisement
Ads by CJ

విష్ణు మంచు, శ్రీ‌ను వైట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ ఢీ సీక్వెల్ డి&డి టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

క్రేజీ కాంబినేష‌న్ విష్ణు మంచు, శ్రీ‌ను వైట్ల ప‌ద‌మూడేళ్ల సుదీర్ఘ విరామంతో మ‌రోసారి వ‌స్తోంది. వారి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `ఢీ` కి సీక్వెల్‌గా డి & డి టైటిల్‌తో సినిమా చేయ‌డానికి వారు రెడీ అవుతున్నారు. డ‌బుల్ డోస్ అనేది ట్యాగ్‌లైన్‌. విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

టైటిల్ డిజైన్ చాలా ఇంట‌రెస్టింగ్‌గా అనిపిస్తోంది. సంకెళ్ల మ‌ధ్య రెండు డి అక్ష‌రాల‌ను డిజైన్ చేశారు. ఢీలో ఎంత కామెడీ, యాక్ష‌న్ ఉన్నాయో అంత‌కు రెట్టింపు కామెడీ, యాక్ష‌న్ ఈ సినిమాలో ఉంటాయ‌నే సంకేతాన్నిస్తూ డ‌బుల్ డోస్ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై విష్ణు మంచు స్వ‌యంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అవ‌ర‌మ్ భ‌క్త మంచు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢీతో స‌హా శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన ప‌లు సినిమాల‌కు ప‌నిచేసిన ర‌చ‌యిత గోపీమోహ‌న్ ఈ చిత్రానికి మ‌రో పాపుల‌ర్ రైట‌ర్ కిషోర్ గోపుతో క‌లిసి స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఫామ్‌లో ఉన్న‌ యంగ్ సెన్సేష‌న్ మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, మోహ‌న‌కృష్ణ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఇండియాలో నంబ‌ర్ వ‌న్ ఫైట్‌మాస్ట‌ర్‌గా పేరుపొందిన పీట‌ర్ హెయిన్ డి & డిలోని హై వోల్టేజ్ యాక్ష‌న్ సీన్స్‌ను రూపొందించ‌నున్నారు.

ఎం.ఆర్‌. వ‌ర్మ ఎడిట‌ర్‌గా, చిన్నా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

విష్ణు జోడీగా ఎవ‌రు న‌టించేదీ, ఇత‌ర తారాగ‌ణం వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

D&D Announced With Title Poster:

Vishnu Manchu, Sreenu Vaitla’s D&D Announced With Title Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ