సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆర్గనైజర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ జన్మదిన వేడుకలు చెన్నైలో ని ఆంధ్ర క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరగడం ఇదే మొదటి సారి.. ఆయన చేసుకోవడం కూడా ఇదే మొదటి సారి. ముఖ్య అతిథులు గా నిర్మాత వై. సురేంద్ర రెడ్డి, నిర్మాత సి. ఎన్. రావు, నిర్మాత యువరాజు, నిర్మాత ముత్యాల ఆంజనేయులు, నిర్మాత హరిబాబు, లైన్ ప్రొడ్యూసర్ నయీమ్ అహమ్మద్ అందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాతలు ప్రసన్న కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంశించారు.