పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు రాజకీయాలంటూ జనసేన పార్టీ స్థాపించి.. ఆంధ్ర రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలంటూ బయలుదేరాడు. పవన్ ఫాన్స్ ని, ఏపీ ప్రజలను నమ్ముకుని 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం తన సీటుని కూడా తాను గెలవలేకపోయాడు. మొదట్లో బిజెపి, టిడిపి తో పొత్తు పెట్టుకున్న పవన్ తర్వాత ఎన్నికల్లో సోలోగా పోటీకి దిగి చేతులు కాల్చుకున్నాడు. నమ్ముకున్న ఫాన్స్ నట్టేట ముంచేశారు. అయినా రాజకీయాలను వదలని పవన్ మొదట్లో బాగానే ఉన్నా.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చి రాజకీయాలను లైట్ తీసుకుంటున్నాడు.
ఇప్పుడిపుడే మళ్ళీ సినిమా షూటింగ్స్, రాజకీయాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ నిర్ణయం అందరికి షాకిస్తుంది. అదే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చెయ్యడం. తాజాగా జీహెచ్ఎంసీ కి ఎన్నికల నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణాలో కాంగ్రెస్, బిజెపిని తోక్కేసి రాజకీయ శక్తిగా మారిన టీఆరెస్ ముందు జనసేన పార్టీ తో పవన్ ఎలా ఎదురు నిలబడతాడు. అసలు జనసేన పార్టీ తెలంగాణాలో ఉన్న విషయమే ఎవరికీ తెలియదు. పవన్ తెలంగాణ కన్నా ఎక్కువగా ఏపీ రాజకీయాల్లోనే చురుగ్గా పాల్గొంటాడు. అలాంటిది పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనని దింపడం టైం వేస్ట్ కాక మరేమిటి అంటున్నారు.
ఇక్కడ తెలంగాణాలో జనసేన పార్టీ యాక్టీవ్ గా లేదు. కేవలం పవన్ ని చూసి ఓట్లసేస్తారంటే ఎంత పొరబాటో ఏపీ ఎన్నికల విషయంలో తేలిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనమని. తమని ప్రజలు కోరుతూ విన్నపాలు చేసినందుకే ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నామని, గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు పార్టీ నేతలు, కమిటీ మెంబెర్స్ సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించాడు. గ్రేటర్ పరిధిలోనూ జనసేన కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతున్నారని.. ప్రజల కోరిక మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన తరుపున అభ్యర్థుల ఎంపిక చేసి పోటీకి నిలబెడుతున్నట్టుగా పవన్ ప్రకటించాడు. మరి అచ్చిరాని రాజకీయాల కోసం.. "పవన్ కి ఇంత పాకులాట ఎందుకు.. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసుకోక" అంటున్నారు సినీజనాలు.