Advertisementt

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ 'విటమిన్ షి'

Mon 16th Nov 2020 08:42 PM
vitamin shi movie,  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ 'విటమిన్ షి'
Artificial Intelligence 'Vitamin Shi' ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ 'విటమిన్ షి'
Advertisement
Ads by CJ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో ‘పేపర్ బాయ్'  దర్శకుని చిత్రం  'విటమిన్ షి' 

‘పేపర్ బాయ్' చిత్రంతో దర్శకునిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంలో తాజాగా రూపొందించిన చిత్రం 'విటమిన్ షి' షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తో యూట్యూబ్ లో ప్రాచుర్యం  పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం ఇందులో హీరోగా నటించారు. గుజరాతీ భాషలో రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రాచి ఇందులో హీరోయిన్ గా చేశారు. రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్  పతాకంపై రవి పోలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు.

దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ఆక్రమిస్తుందనేది ఈసినిమా మూల కథాంశం. మనకు సహాయకారిగా ఉంటుందనుకున్న ఈ ఆర్టిఫీషియల్ఇంటెలిజెన్సీ చివరకు మనల్నే డామినేట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్ గా ఈ సినిమాలో చూపించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత టాప్ లెవెల్ కి వెళ్లినా.. చివరకు మనుషుల్నేరీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా, మనుషుల ఎమోషన్స్ ని రీప్లేస్ చేయడం మాత్రంవాటికి అసంభవం. వీటన్నిటినీ ఫన్ మోడ్ లో చూపించాం. ఈ సినిమాలో మొత్తం పన్నెడు పాత్రలు ఉంటాయి కానీ, ప్రధానంగా 4 పాత్రల చుట్టే సినిమా తిరుగుతుంది. లాక్డౌన్ టైమ్ లో ఈ చిత్రం షూటింగ్ చేశాం. స్టోరీ పరంగానే కాకుండా, టెక్నీకల్ గా కూడా హైస్టాండర్డ్స్ లో ఉంటుందీ సినిమా. ఇటీవలే ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేశాం. చాల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ కాపీతో సహా సినిమామొత్తం రెడీగా ఉంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శివప్రసాద్, సంగీతం: PVR రాజు, ఎడిటింగ్ : LN స్టూడియోస్ , నిర్మాత: రవి పోలిశెట్టి, రచన-దర్శకత్వం : జయశంకర్.

Artificial Intelligence 'Vitamin Shi':

Artificial Intelligence 'Vitamin Shi'

Tags:   VITAMIN SHI MOVIE,
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ