ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న హారర్ చిత్రం ‘జంగిల్’ ఫస్ట్ లుక్ విడుదల.
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై కార్తీక్, విఘ్నేష్ దర్శకత్వంలో మహేశ్ గోవిందరాజ్, అర్చనా చందా నిర్మిస్తోన్న హారర్ చిత్రం ‘జంగిల్’. వేదిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘చీకటిగా ఓ ఇల్లు ఆ ఇంటి నుండి అస్థిపంజరాలు.. దీపం కాంతిలో వాటిని చూస్తూ షాకవుతున్న హీరో ఆది, హీరోయిన్ వేదిక’ ఇదే జంగిల్ ఫస్ట్ లుక్. ‘ఆది శ్వాసిస్తుంది.. అది దాక్కొని ఉంటుంది.. అది వేటాడుతుంది’ అనే క్యాప్షన్‌తో సినిమాలో ఏదో భయంకరమైన జంతువో, దెయ్యమో ఉండబోతుందనే విషయం ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మహేశ్ గోవిందరాజ్, అర్చనా చందా మాట్లాడుతూ ‘‘హారర్ చిత్రాలను ఎన్నింటినో తెలుగు ప్రేక్షకులు తెరపై చూసి థ్రిల్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కంటెంట్‌తో రూపొందిన జంగిల్ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాం. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే టీజర్, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. కార్తీక్, విఘ్నేశ్ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. సినిమాకు కెమెరా పనితనం, నేపథ్య సంగీతం మేజర్ ఎసెట్‌గా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఆదిసాయికుమార్‌గారికి, హీరోయిన్ వేదికగారికి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు.
నటీనటులు: ఆది సాయికుమార్, వేదిక, నోయ్‌రిక, లల్లు, మధుసూదన్ రావు, జై కుమార్ తదితరులు
సాంకేతిక వర్గం: అర్చనా చందా, లైన్ ప్రొడ్యూసర్స్: ఎస్.సత్యమూర్తి, సురేశ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ‌్రీరాం, విక్టర్ ప్రభాహరన్, సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్, పి.ఆర్.ఒ: వంశీ కాక, సంగీతం: జోస్ ఫ్రాంక్లిన్, ఎడిటింగ్: శివ నందీశ్వరన్, ఆర్ట్: శివ కుమార్, స్టంట్స్: అశోక్, కాస్ట్యూమ్స్ : సెల్వం, రచన, దర్శకత్వం: కార్తీక్ విఘ్నేశ్, నిర్మాతలు: మహేశ్ గోవిందరాజ్.