Advertisementt

సుధీర్ బాబు - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబో రిపీట్!!

Mon 16th Nov 2020 07:46 PM
sudheer babu,mohanakrishna indraganti,benchmark studios  సుధీర్ బాబు - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబో రిపీట్!!
Sudheer Babu - Mohanakrishna Indraganti Film Announcement సుధీర్ బాబు - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబో రిపీట్!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఒక‌వైపు క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు, మ‌రోవైపు మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కు స‌రిగ్గా స‌రిపోయే హీరోల్లో సుధీర్ బాబు ఒక‌రు. స‌మ్మోహ‌నం, వి చిత్రాల త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడోసారి ఆయ‌న మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు.

మ‌రోవైపు త‌న‌దైన శైలిలో విభిన్న త‌ర‌హా చిత్రాల రూప‌క‌ల్ప‌న‌తో టాలీవుడ్‌లోని అత్యంత ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి పేరు తెచ్చుకున్నారు.

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఈ మూడో సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా రూపొంద‌నున్న‌ది. పైగా ఇది మోహ‌న‌కృష్ణ‌కు డ్రీమ్ ప్రాజెక్ట్‌. ఈ ఇద్ద‌రికీ ఇది మ‌రో ఎంట‌ర్‌టైనింగ్ ఫిల్మ్ కాబోతోంది.

తొలి సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంటూ, అనూహ్య‌మైన ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకుంటూ వ‌స్తోన్న గార్జియ‌స్ బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో సుధీర్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా ఎంపిక‌య్యారు.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రాన్ని బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ళ్ల‌ప‌ల్లి సంయుక్తంగా నిర్మించ‌నుండ‌గా, బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై గాజుల‌ప‌ల్లి సుధీర్ బాబు స‌మ‌ర్పించ‌నున్నారు.

వివేక్ సాగ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా, పి.జి. విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ర‌వీందర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. పాట‌ల‌ను సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి రాస్తున్నారు. ఇది డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఫేవ‌రేట్ టీమ్‌. ఇప్ప‌టికే ఈ టీమ్‌తో ఆయ‌న సూప‌ర్ హిట్స్‌ను అందించారు.

త‌న సినిమాల్లో పాట‌ల‌కు ఆయ‌న చాలా ప్రాముఖ్యం ఇస్తుంటారు. అచ్చ తెలుగు పాట‌ల‌ను ఆడియెన్స్‌కు అందించే ఉద్దేశంతో అగ్ర‌శ్రేణి గేయ ర‌చ‌యిత‌లు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రిల‌ను ఆయ‌న తీసుకున్నారు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

Sudheer Babu - Mohanakrishna Indraganti Film Announcement:

Sudheer Babu, Mohanakrishna Indraganti, Benchmark Studios’s Film Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ