Advertisementt

మరో మారు `సీటీమార్‌`

Sun 15th Nov 2020 12:51 PM
seetimaarr movie,direction sampath nandi,producer srinivasaa chhitturi,seetimaarr movie,citimar movie  మరో మారు `సీటీమార్‌`
Seetimaarr shooting resumes on November 23 మరో మారు `సీటీమార్‌`
Advertisement
Ads by CJ

                        న‌వంబ‌ర్ 23నుండి `సీటీమార్‌` షూటింగ్ పునః ప్రారంభం..

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `సీటీమార్‌`. పవన్‌ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‌లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ షూటింగ్‌ న‌వంబ‌ర్ 23 నుండి ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమా ని కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత  శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ -  ``లాక్‌డౌన్‌కి ముందే రాజమండ్రి, హైదరాబాద్ ఆర్ఎఫ్‌సిలో‌ షూటింగ్ జ‌రిపి మూడు భారీ షెడ్యూల్స్‌లో 60% సినిమా పూర్తిచేశాం. ఈ నెల 23 నుండి తిరిగి షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మ‌రియు భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి సన్నివేశం హార్ట్‌ట‌చింగ్‌గా ఉంటుంది.  శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ బేన‌ర్‌లో  సంపత్ నంది గారు హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ఎంత‌గానో ఎదురు చూస్తున్న గోపీచంద్ అభిమానుల‌కోసం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకొస్తాం`` అన్నారు.

మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ - ``లాంగ్ వార్మ‌ప్, సాలిడ్ స్ట్రెచెస్, ప‌వ‌ర్‌ప్యాక్డ్ ప్రాక్టీస్ త‌ర్వాత  ఫిట్ అండ్ ఫ్యాబ్‌గా మా టీమ్ అంద‌రం అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల జాగ్రత్తల‌తో మాకు ఎంతో ఇష్టం అయిన సీటిమార్  షూటింగ్ ‌కోసం సిద్ద‌మయ్యాం. న‌వంబ‌ర్ 23నుండి కూత మొదలు`` అన్నారు.

ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా  మిల్కీబ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్‌లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి.. సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

seetimaarr movie,direction sampath nandi,producer srinivasaa chhitturi,seetimaarr movie,citimar movie

Seetimaarr shooting resumes on November 23:

Seetimaarr shooting resumes on November 23

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ