Advertisementt

క‌ళ్యాణ్ దేవ్ టైటిల్ కిన్నెరసాని!

Sat 14th Nov 2020 12:47 PM
kalyaan dhev,kinnerasaani movie,ram thalluri,kinnerasaani movie  క‌ళ్యాణ్ దేవ్ టైటిల్ కిన్నెరసాని!
Kalyaan Dhev's Titled Kinnerasaani క‌ళ్యాణ్ దేవ్ టైటిల్ కిన్నెరసాని!
Advertisement
Ads by CJ

క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 టైటిల్ కిన్నెరసాని

క‌ళ్యాణ్ దేవ్ - ర‌మ‌ణ‌తేజ - రామ్ త‌ళ్లూరి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న కిన్నెర‌‌సాని. దీపావ‌ళి సంద‌ర్భంగా క‌ళ్యాణ్ దేవ్ కిన్నెర‌సాని టైటిట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌.

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6కి పూజా కార్య‌క్ర‌మాల‌తో ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. కిన్నెర‌‌సాని అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. కిన్నెర‌‌సాని టైటిల్ ని ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. కంటెంట్ కి పెద్ద పీఠ‌ వేస్తూ, నిర్మాణ విలువ‌ల్లో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ వారు మ‌రో నిర్మాణ సంస్థ‌ శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసి కిన్నెర‌సాని చిత్రాన్ని సైతం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కిన్నెర‌‌సాని టైటిల్ లుక్ పోస్ట‌ర్ లో సైతం సినిమా క‌థాంశం ప్ర‌తిభింబిచేలా ప్ర‌శాంత‌మైన స‌ముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేయ‌డం జ‌రిగింది. అలానే కిన్నేర‌సాని టైటిల్ కి క్యాప్ష‌న్ గా అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్ (హ‌ద్దు లేక‌పోవ‌డం ప్ర‌మాద‌క‌రం) అనే సంస్కృత పదాన్ని కూడా జోడించారు. ఈ సినిమా సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల ఈ సినిమాకు నిర్మాత‌లుగా రూపొందుతుంది. విజేత వంటి క్లాసిక్ హిట్ అందుక‌ని ప్ర‌స్తుతం సూప‌ర్ మచ్చి అనే క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్న క‌ళ్యాణ్ దేవ్ నుంచి మూడో సినిమాగా ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ కిన్నెర‌‌సాని రాబోతుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ఛ‌లో, భిష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే పూర్తి చేసుకొని సెట్స్ మీద‌కు సినిమాను తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు. 

రామ్ త‌ళ్లూరి ప్రొడ‌క్ష‌న్, బ్యానర్ - ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్, స‌మ‌ర్ప‌ణ - సాయిరిషిక‌, నిర్మాత - రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌, క‌థ, క‌థ‌నం - దేశ్ రాజ్ సాయితేజ్, సంగీతం - మ‌హతి సాగ‌ర్, సినిమాటోగ్రాఫర్ - సురేశ్ ర‌ఘుతు, ఎడిటింగ్ - అన్వ‌ర్ అలీ, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ -  శ్రీ నాగేంద్ర తంగ‌ల‌, సౌండ్ డిజైన్ - సింక్ సినిమా, ద‌ర్శ‌కుడు - ర‌మ‌ణ తేజ.

kalyaan dhev,kinnerasaani movie,ram thalluri,kinnerasaani movie

Kalyaan Dhev's Titled Kinnerasaani :

Kalyaan Dhev Movie Title Kinnerasaani 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ