Advertisementt

'మోస‌గాళ్లు' తో సునీల్ శెట్టి!

Fri 13th Nov 2020 06:24 PM
mosangallu movie,sunil shetty,producer vishnu manchu,kajal aggarwal,suniel shetty,ruhi singh,naveen chandra,navdeep  'మోస‌గాళ్లు' తో సునీల్ శెట్టి!
Suniel Shetty’s Character Teaser From Mosagallu 'మోస‌గాళ్లు' తో సునీల్ శెట్టి!
Advertisement
Ads by CJ

                          'మోస‌గాళ్లు' లో సునీల్ శెట్టి క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మోస‌గాళ్లు' కోసం ప్రేక్ష‌కులు అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుద‌లవుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై 'మోస‌గాళ్లు' చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు ఇదివ‌ర‌కెన్న‌డూ లేని విధంగా దాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇటీవ‌ల అల్లు అర్జున్ రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా ఈ చిత్రంలో సునీల్ శెట్టి పోషించిన క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో ఏసీపీ కుమార్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా సునీల్ శెట్టి క‌నిపించారు. ఇండియాలో పుట్టి, అమెరికాను షేక్ చేసిన వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌కు బాధ్యులైన‌వాళ్ల‌ను ప‌ట్టుకొనే బాధ్య‌త‌ను ఆయ‌న‌కు అప్ప‌గించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. నా జోన్‌లో ఎవ‌డైనా త‌ప్పుచేస్తే, వాడి లైఫ్ ఇంక డేంజ‌ర్ జోనే. వాడెంత తోపైనా.. అని సునీల్ శెట్టి చెప్పే డైలాగ్‌ను బ‌ట్టి ఆయన క్యారెక్ట‌ర్ ఎంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ అనేది తెలుస్తోంది. టీజ‌ర్ చివ‌రి ఫ్రేమ్‌లో విష్ణు మంచు న‌వ్వే తీరును చూస్తే, ఆ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన‌ట్లు ఊహించ‌వ‌చ్చు. మూవీ టీజ‌ర్‌కు, అంత‌కు ముందు టైటిల్ థీమ్‌కు ఇచ్చిన‌ట్లే ఈ క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌కు శ్యామ్ సీఎస్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్తేజ‌భ‌రితంగా ఉంది. జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఓ విశేషం. విష్ణు జోడీగా రుహీ సింగ్ క‌నిపించ‌నున్నారు.

తారాగ‌ణం: విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, రుహీ సింగ్, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌

సాంకేతిక బృందం: మ్యూజిక్‌: శ‌్యామ్ సీఎస్‌, సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం. పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌. నిర్మాత‌: విష్ణు మంచు, ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌. 

Suniel Shetty’s Character Teaser From Mosagallu:

Sunil Shetty Character Teaser Released In Mosangallu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ