Advertisementt

'పుష్ప' రాజ్ బ్యాక్ లుక్!!

Thu 12th Nov 2020 04:12 PM
allu arjun,sukumar,pushpa movie,shooting update  'పుష్ప' రాజ్ బ్యాక్ లుక్!!
Pushpa Movie Shooting update 'పుష్ప' రాజ్ బ్యాక్ లుక్!!
Advertisement
Ads by CJ

మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ పుష్ప షూటింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో రూపొందుతున్న‌ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ పుష్ప‌. అలా వైకుంట‌పురంలో మరియు రంగస్థలం వంటి ఇండ‌స్ట్రీ హిట్స్ త‌రువాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్ష‌కుల్లో కూడా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పుష్ప ఫ‌స్ట్ లుక్ కి ప్రేక్ష‌కులు, అభిమానుల ద‌గ్గ‌ర‌ నుంచి అనూహ్యమైన స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే, అయితే పుష్ప షూటింగ్ ఎప్పుడు మొద‌లౌవుతుందా అనే ఉత్కంఠ సైతం అంత‌టా నెల‌కొంది. ఈ ఉత్కంఠ‌కి తెర‌దించుతూ పుష్ప చిత్ర బృందం త‌మ తొలి షెడ్యూల్ షూటింగ్ మొద‌లుపెట్టేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మ‌న్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ న‌వంబర్ 10 నుంచి జ‌రుగుతోంది. ఈ షూట్ షెడ్యూల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు చిత్రంలో ఉన్న ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందుకుంటూ, టాలీవుడ్ ఫెవ‌రెట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్న‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. పుష్ప షూటింగ్ మొద‌లైన సంద‌ర్భంగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ

పుష్ప సినిమా స్టోరీ నాకు బాగా న‌చ్చింది, ఎర్ర‌చందనం స్మ‌గ్లింగ్ క‌థాంశంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది, నా కెరీర్ లో ఈ త‌ర‌హా సినిమా చేయడం ఇదే మొద‌టిసారి.ఓ యూనీవ‌ర్స్ అప్పీల్ ఉన్న పాయింట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ సినిమా స్టోరీని అద్భుతంగా రెడీ చేశాడు. కోవిడ్ క్రైసిస్ మ‌ధ్య మా యూనిట్ ఈ చిత్రాన్ని చాలా జాగ్ర‌త్త‌గా చిత్రీక‌రించ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది.  

దర్శ‌కుడు సుకుమార్ మాట్లాడుతూ

పాన్ ఇండియాకి రేంజ్ లో పుష్ప‌ని తెర‌కెక్కిస్తున్నాము, అన్ని భాష‌ల్లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి ఓ స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చే రీతిన ఈ సినిమా స్టోరీని రెడీ చేశాను. స్టైలిష్ అల్లు అర్జున్, చిత్ర నిర్మాత‌లు ఇస్తున్న స‌పోర్ట్ తో కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి ఈ సినిమా షూటింగ్ ని మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో చిత్రీక‌రిస్తున్నాము

నవీన్ యెర్నేని & వై రవిశంకర్ మాట్లాడుతూ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప ఓ ఇంట్రెస్టింగ్ యూనీవ‌ర్స‌ల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోంది. కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రించి ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టాము. కొత్త కొత్త‌గా ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయడానికి మేము ఎప్పూడు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాము, ఈ విష‌యంలో పుష్ప విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాము. అలాగే షూటింగ్ చేసేటప్పుడు నిర్మాతలుగా మేము అవసరమైన జాగ్రత్తలు మరియు భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి సినిమాను చిత్రీకరించరిస్తున్నాము.

Pushpa Movie Shooting update :

Allu Arjun - Sukumar Pushpa Movie update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ