Advertisementt

కెప్టెన్సీ అనుభవించకముందే.. ఎలిమినేట్ అయ్యాడా?

Sun 08th Nov 2020 02:06 PM
bigg boss,amma rajasekhar,eliminated  కెప్టెన్సీ అనుభవించకముందే.. ఎలిమినేట్ అయ్యాడా?
Amma Rajasekhar Eliminated From Bigg Boss 4 కెప్టెన్సీ అనుభవించకముందే.. ఎలిమినేట్ అయ్యాడా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 లో డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ మీద ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేఖత ఉంది. ఎలాగో అమ్మ రాజశేఖర్ గత వారమే బయటికి వెళ్ళిపోతాడనుకుంటే.. నాగార్జున - నోయెల్ చలవ వలన అమ్మ రాజశేఖర్ బ్రతికి పోయాడు. బిగ్ బాస్ హౌస్ లో అమ్మ రాజశేఖర్ మీద అందరి మనస్సులో వ్యతిరేఖత ఓ రేంజ్ లో ఉంది. అయితే అమ్మ ఈ వారం బయటికి వెళ్లే ఛాన్స్ ఉండనై ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో హారిక - అరియనాల మీద నెగ్గేసి కెప్టెన్ అయిన అమ్మ రాజశేఖర్ తన మీద వ్యతిలేఖత ఉన్న కంటెస్టెంట్స్ మీద రివెంజ్ ప్లాన్ చేసుకున్నాడు.

అందులో భాగంగానే అమ్మ రాజశేఖర్ అభిజిత్, అఖిల్, హరికలను టార్గెట్ చేసి వాళ్ళని ఆటాడిస్తున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడినందుకు అమ్మ రాజశేఖర్ అభిజిత్ కి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆయితే కెప్టెన్సీలో జెన్యూన్ గా ఉండి ఉంటె ఓకె.. అలా కాకుండా అమ్మ రాజశేఖర్ తనకిష్టమైన అరియనాని పని చెయ్యకుండా అసిస్టెంట్ గా పెట్టుకోవడమే కాదు.. అవినాష్ కి మెహ బూబ్ కి ఎక్కువ పని ఇవ్వకుండా పార్షియాలిటీ చూపిస్తున్నాడు. కెప్టెన్ గా హౌస్ ని ఆటాడించాలనుకుంటున్నాడు. కానీ అమ్మ రాజశేఖహ్ర్ కి కెప్టెన్సీ అనుభవించే యోగం లేదు. ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న అమ్మ ని బుల్లితెర ప్రేక్షకులు ఎలిమినేట్ చెయ్యబోతున్నారు. 

నిన్న కమల్ హాసన్ హారికాని సేవ్ చెయ్యగా.. అవినాష్ - మోనాల్ - అమ్మ రాజశేఖర్ - అభిజిత్ లలో ఈ రోజు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళబోయేది అమ్మ రాజశేఖర్ అని తెలుస్తుంది. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యి అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ స్టేజ్ పైకి అంటే నాగ్ పక్కకి చేరాక హౌస్ లో ఎవరిని బ్యాడ్ చెయ్యబోతున్నాడో చూద్దాం. 

 

Amma Rajasekhar Eliminated From Bigg Boss 4:

After Bigg Save, Amma Rajasekhar Gets Eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ