బిగ్ బాస్ సీజన్ 4 వీక్ డేస్ లో బాగా వీక్ కంటెంట్ తో టీఆర్పీ విషయంలో సఫర్ అవుతుంది. ఇక శనివారం, ఆదివారం నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద చేసే వ్యాఖ్యానానికి అందరూ ఫిదా అవుతున్నారు. నాగ్ కూడా బిగ్ బాస్ సంభ్యులు నా ఫ్యామిలీ అంటూనే హౌస్ లో తప్పు చేసిన వారికీ క్లాస్ పీకి వారిని కరెక్ట్ చేస్తున్నాడు. శనివారం వచ్చింది అంటే హౌస్ లోని సబ్యులకు నాగ్ క్లాస్ కంపిల్సరి. ఇక అదివారం సండే ఫండే అంటూ నాగార్జున ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నాడు. తాజాగా శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి నాగ్ క్లాస్ షురూ అయ్యింది.
అభిజిత్ ని సెల్ఫ్ రెస్పెక్టు విషయంలో క్లాస్ పీకిన నాగార్జున మోనాల్ విషయంలో అఖిల్ ని ప్రశ్నించాడు. మోనాల్ ని అఖిల్ నామినేట్ చెయ్యడంతో మోనాల్ బాగా హార్ట్ అవడమే కాదు... నాగార్జున దగ్గర ఆ ప్రస్తావన తీసింది. అఖిల్ ని నాగ్ నీకు మోనాల్ ఫ్రెండా మోర్ ఫ్రెండా అని అడగడంతో అఖిల్ మొహం మాడిపోయింది. ఇక మోనాల్ అరియానని పాయింట్ అవుట్ చేస్తూ గేమ్ లో అరియనా చాలా ఎక్కువ చేసి మొహం మీద వాటర్ పోసింది అనగానే నేను బిగ్ బాస్ టాస్క్ ఇస్తే దానిని ఆడా.. ఆ టాస్క్ చేశా అంటూ సమాధానం చెప్పడం.. సోహైల్ - అరియనా మధ్యన మాటల యుద్ధంతో ఈ శనివారం నాగ్ క్లాస్ షురూ అయ్యింది.