Advertisementt

నాగ శౌర్య మరో బ్యానర్ ఐరా సినిమాస్!!

Sat 07th Nov 2020 04:54 PM
ira cinemas,naga shourya,ira creations  నాగ శౌర్య మరో బ్యానర్ ఐరా సినిమాస్!!
Ira Cinemas Production No 1 Film Launched నాగ శౌర్య మరో బ్యానర్ ఐరా సినిమాస్!!
Advertisement
Ads by CJ

నాగ‌శౌర్య హీరోగా ఛ‌లో, అశ్వ‌థ్థామ లాంటి సూప‌ర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేష‌న్స్ సంస్థ నుంచి సోద‌ర సంస్థ‌గా ఐరా సినిమాస్ ప్రారంభ‌మైంది.

ఔత్సాహిక న‌టులు, ద‌ర్శ‌కుల‌తో కంటెంట్ ప్ర‌ధాన చిత్రాల‌ను నిర్మించ‌డం ఐరా సినిమాస్ ఏర్పాటులోని ఉద్దేశం. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టాల‌ని క‌ల‌లు క‌నే నూత‌న‌ న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఇది మంచి అవ‌కాశం.

హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో ఐరా సినిమాస్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రిగింది. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి న‌టుడు, వ్యాపార‌వేత్త, ఏఎస్‌పీ మీడియా హౌస్‌ అధినేత అభిన‌వ్ స‌ర్దార్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. న‌వంబ‌ర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంక‌ర్‌ప్ర‌సాద్ ముల్పూరి మాట్లాడుతూ, ఇవాళ మంచిరోజు కావ‌డంతో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ఐరా సినిమాస్ అనేది ఐరా క్రియేష‌న్స్‌కు సోద‌ర సంస్థ‌. యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో బ్యాన‌ర్‌ను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌ను ఈ బ్యాన‌ర్‌పై నిర్మిస్తాం. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్ల‌ర్ అని చెప్పారు.

త్వ‌ర‌లో ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Ira Cinemas Production No 1 Film Launched:

Ira Cinemas Production No 1 Film Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ