Advertisementt

జెమ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

Sat 07th Nov 2020 04:51 PM
ravi teja,gem movie,first look  జెమ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
Gem First Look and motion Poster Launch జెమ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
Advertisement
Ads by CJ

మాస్ మహరాజ్ రవితేజ చేతుల మీదుగా జెమ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

యువ హీరో విజయ్ రాజా నటిస్తున్న కొత్త సినిమా జెమ్. రాశీ సింగ్ ,

నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, అలోక్ జైన్, అజయ్

ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహా లక్ష్మీ మూవీ మేకర్స్

సంస్థ నిర్మిస్తోంది. పత్తికొండ కుమార్ స్వామి నిర్మాత. సుశీల

సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి

చేసుకున్న జెమ్  సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్

మూవీగా తెరకెక్కుతున్న జెమ్ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను

మాస్ హీరో రవితేజ శుక్రవారం రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ...మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్

పోస్టర్ రిలీజ్ చేసిన రవితేజ గారికి కృతజ్ఞతలు. రెండేళ్లు శ్రమించి

సిద్దం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు మా దర్శకుడు సుబ్రహ్మణ్యం

గారు. యాక్షన్ బేస్డ్ గా జెమ్ మూవీ ఉంటుంది. ఆండ్రూ కెమెరా పనితనం,

సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. అన్నారు.

దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...ఎక్కడా రాజీ పడకుండా జెమ్

మూవీని రూపొందించాం. హై టెక్నికల్ వ్యాల్యూస్ ఉంటాయి. సినిమా పూర్తయింది.

విడుదలకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిభ గల సాంకేతిక నిపుణులు మా చిత్రానికి

పనిచేయడంతో అనుకున్నట్లుగా మూవీని చేయగలిగాం. అన్నారు.

నిర్మాత పత్తికొండ కుమారస్వామి మాట్లాడుతూ...జెమ్ మూవీ విడుదలకు సిద్ధంగా

ఉంది. దర్శకుడు సుబ్రహ్మణ్యంకు మొదటి సినిమా ఇది. కష్టపడి సినిమా

రూపొందించారు. విజయ్ రాజా ఇన్ వాల్వ్ అయ్యి నటించారు. సినిమాకు పూర్తిగా

సహకరించారు. ఔట్ పుట్ సంతృప్తికరంగా వచ్చింది. కోటగిరి వెంకటేశ్వరరావు

ఎడిటింగ్, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాకు ఆకర్షణ అవుతాయి. అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ...కుమారస్వామి గారు తమిళ, కన్నడలో సినిమాలు

చేశారు. తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయన

తెలుగులోనే వరుసగా సినిమా చేసేంత పేరు జెమ్ చిత్రంతో రావాలి. ఫస్ట్ లుక్,

మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రవితేజకు థ్యాంక్స్. సినిమా హిట్ అవ్వాలి,

అందరికీ పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

 

 

Gem First Look and motion Poster Launch:

Ravi teja Launches Gem First Look and motion Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ