Advertisementt

ప్రేమసాగరం 1995 ఫస్ట్ లుక్

Sat 07th Nov 2020 04:36 PM
prema sagaram 1995,first look,raj kandukuri  ప్రేమసాగరం 1995 ఫస్ట్ లుక్
PremaSagaram 1995 Movie First look ప్రేమసాగరం 1995 ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

ప్రేమసాగరం 1995 ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరి!!

సాయిశ్వర్, ప్రియాంక రేవరి జంటగా సాయి వైష్ణవి పిక్చర్స్ పతాకంపై వి యస్ ఫణి0ద్ర దర్శకత్వంలో గోపాల్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ప్రేమసాగరం 1995. కంప్లీట్ లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న  ఈ చిత్రం మొదటి షెడ్యూల్  పూర్తిచేసుకుంది. కాగా ఈ చిత్రం టైటిల్, మోషన్ పోస్టర్ ని హీరో సాయిశ్వర్ పుట్టిన రోజు సందర్బంగా    ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. సుమన్, రాజా రవీంద్ర, రమ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్  లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. 

నిర్మాత గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. మా దర్శకుడు ఫణిoద్ర చెప్పిన కథ నచ్చి ఎంతో ఇంప్రెస్ అయి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రేమకథలతో వచ్చే ప్రతి సినిమా యువతీ యువకులను ఆకట్టుకుంటుంది.. కానీ అందులో నాచులర్ గా రియలస్టిక్ గా కొత్తదనంతో ఉండాలి అప్పుడే ఆ కథ ప్రేక్షకులను రక్తికట్టిస్తుంది. అలాంటి కథే మా ప్రేమసాగరం. ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రేమకథలు రావడానికి ఇన్స్పిరేషన్ గా మా ఫిల్మ్ నిలుస్తుంది. మాకు ఎంతో అండగా నిలుస్తూ సపోర్ట్ చేస్తున్న రాజ్ కందుకూరి గారికి నా థాంక్స్..ఈ నెలలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం.. అన్నారు. 

దర్శకుడు ఫణిoద్ర మాట్లాడుతూ.. మా చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. యూత్ ఫుల్ లవ్  ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కి రెడి అవుతున్నాం.. అన్నారు.

PremaSagaram 1995 Movie First look:

Prema Sagaram 1995 Movie First Look launch By Raj Kandukuri 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ