Advertisementt

వైఎస్ జగన్ కి రివర్స్ గేర్ స్టార్ట్ అయ్యిందా?

Fri 06th Nov 2020 02:12 PM
ys jagan,ap government,schools re open,covid19  వైఎస్ జగన్ కి రివర్స్ గేర్ స్టార్ట్ అయ్యిందా?
Ys jagan takes wrong decision on school openings వైఎస్ జగన్ కి రివర్స్ గేర్ స్టార్ట్ అయ్యిందా?
Advertisement

కరోనా కారణంగా మూత బడిన స్కూల్స్, కాలేజెస్ అన్ని అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మేరకు తెరవొచ్చని కేంద్రం చెప్పిందో లేదో.. ఏపీ లోని జగన్ ప్రభుత్వం పిల్లల బడులు ఎప్పుడు తెరుద్దామా అని కాచుకుని కూర్చుంది. (మాట తప్పం మడమ తిప్పం అంటూనే) కరోనా బాగా ఉన్న టైం లోనే అంటే ఆగష్టు 5 నుండి స్కూల్స్ రీ ఓపెన్ అన్నారు. మళ్ళీ కాదు సెప్టెంబర్ 5 నుండి అన్నారు.. అదీ కాదు.. అక్టోబర్ 5 న అన్నారు. అదీ జరగలేదు. కానీ నవంబర్ 2 న స్కూల్స్ ఓపెన్ చేస్తామని చెప్పినట్టుగానే జగన్ ఏపీ లో స్కూల్స్ ఓపెన్ చేయించారు. మరి కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటూ మంకు పట్టు పడుతున్న ఏపీ మంత్రులు స్కూల్స్ ఓపెనింగ్ విషయంలో చాలా హుషారుగా ఉన్నారు. నవంబర్ 2 న స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి.

జగన్ ఇచ్చే జగన్న విద్యా కానుకల కోసం తల్లి తండ్రులు తమ పిల్లని స్కూల్స్ కి పంపడానికి ఒప్పుకున్నారు. బడుల్లో టాయిలెట్స్ క్లీనింగ్, శానిటైజేషన్, మాస్క్ లు తప్పనిసరి చేసిన ప్రభుత్వానికి కరోనా అడుగడుగునా షాకిచ్చింది. కరోనా టెస్ట్ చేసి మరీ స్కూల్ లో విద్యార్థులను కూర్చో బెట్టి ఉపిరి పీల్చుకునేలోగా... రోజులో వేలల్లో కరోనా కేసులతో విద్యార్థులు స్కూల్ నుండి బయటికి వస్తున్నారు. గత నాలుగు రోజుల్లో చాలా జిల్లాలో పలు స్కూల్స్ లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం పెద్దగా లెక్క చెయ్యడం లేదు. అసలు ఇప్పుడు ఏపీ స్కూల్స్ అన్ని కరోనా వ్యాప్తి చేసే సెంటర్స్ గా మారాయంటే అతిశయోక్తి అనిపించిందేమో. 

మరి జగన్ ఏదో ప్లాన్ చేసి మరీ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు విద్యార్థులు, తల్లి తండ్రులు గడగడా ఒణికి పోతున్నారు. అయినప్పటికీ.. జగన్ మాత్రం స్కూల్స్  విషయంలో అదే పట్టుదలతో ఉండడమే కాదు.. ఏపీ ప్రభుత్వానికి అనుకూల మీడియాలు ఈ కరోనా కేసులు స్కూల్ కి రాకముందు ఉన్నవే.. ఇప్పుడు ఈ విషయాలను ప్రతి పక్షాలు రాద్ధాంతం చెయ్యడం కరెక్ట్ కాదంటూ వాదిస్తున్నాయి. మరి స్కూల్స్ రీ ఓపెనింగ్ విషయంలో జగన్ ప్లాన్ బెడిసికొట్టడం ఖాయంగానే కనబడుతుంది.

Ys jagan takes wrong decision on school openings:

Ys jagan decisions creates wrong impact on his government

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement