Advertisementt

అల్లు అర్జున్ కు నచ్చిన కలర్ ఫోటో!

Sat 31st Oct 2020 04:45 PM
stylish star,allu arjun,congratulates,colour photo,suhas,chandini chaudary  అల్లు అర్జున్ కు నచ్చిన కలర్ ఫోటో!
Stylish Star Allu Arjun congratulates team Colour Photo అల్లు అర్జున్ కు నచ్చిన కలర్ ఫోటో!
Advertisement
Ads by CJ

చిన్న సినిమా పెద్ద సినిమా, స్టార్ కాస్ట్ లేదా కొత్త వాళ్ల ఇలాంటి తార‌తమ్యాలు ప‌ట్టించుకోకుండా త‌న మ‌న‌సుకు న‌చ్చిన సినిమాకు సంబంధించిన బృందాల్ని ప‌లిచి వారిని అభినందించ‌డ‌మే కాకుండా వారికి ప్రోత్సాహం ఇవ్వ‌డంలో ముందుంటారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఇదే నేప‌ధ్యంలో ‌క‌ల‌ర్ ఫొటో చిత్ర బృందానికి స్టైలిష్ స్టార్ అభినంద‌నలు ద‌క్కాయి. అంతేకాకుండా తాను క‌ల‌ర్ ఫొటో చిత్రాన్ని చూశా అని, త‌నుకు ఈ సినిమా ఎంత‌గానో నచ్చింద‌ని ఈ సినిమాకు సంబంధించిన డైరెక్ట‌ర్ కి, ఆర్టిస్టుల‌కి అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు స్టైలిష్ స్టార్.

ఆక్టోబ‌ర్ 23న ఆహా యాప్ ద్వారా క‌ల‌ర్ ఫొటో చిత్రం విడుద‌లై అశేష తెలుగు సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటూ బ్లాక్ బస్ట‌ర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. అటు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ‌ల‌తో పాటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు క‌ల‌ర్ ఫొటో పై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపిస్తున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్స్, లౌక్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక స‌మ‌ర్ప‌ణ‌లో సాయిరాజేశ్, బెన్నీలు సంయుక్తంగా క‌ల‌ర్ ఫొటోని నిర్మించారు. సందీప్ ద‌ర్శ‌కత్వంలో సుహాస్, చాందినీలు జంట‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప్ర‌ముఖ న‌టుడు సునీల్, వైవా హ‌ర్ష‌ ఈ సినిమాలో కీల‌క పాత్రలు పోషించారు.

Stylish Star Allu Arjun congratulates team Colour Photo:

Stylish Star Allu Arjun congratulates team Colour Photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ