శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?). షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం లోని రామసక్కనోడివిరో అనే పాటను ఈ రోజు హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ పాటను రఘు కుంచె స్వరపరచగా బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చారు. మంగ్లీ ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ...ఈ చిత్రంలో మొదట పాట పెట్టాలనుకోలేదు. షూటింగ్ పూర్తయ్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి సత్యం గారు అద్బుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. శేఖర్ మాస్టర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్ ఆదాశర్మగారు అదరగొట్టారు. నిర్మాత గౌరికృష్ణ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. దర్శకుల పనితీరు ఏంటో ఈ పాటతోనే తెలుసుకోవచ్చు. ఇక ఈ పాండమిక్ టైమ్ లో ఈ సినిమా రావడం కొంత సంతోషాన్ని కలిగించే విషయం అన్నారు.
నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ...ఈ పాటకు సంబంధించిన క్రెడిట్ అంతా మా మ్యూజిక్ డైరక్టర్ రఘు కుంచె గారికి వెళ్తుంది. ఆయన ఈ పాటతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ఎక్స్ లెంట్ గా ఇచ్చారు. ఆదాశర్మ గారు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. తన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు తన ఎంత మంచి డాన్సరో ఈ సినిమాతో తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ గా కొరియోగ్రఫీ తో పాటకు ప్రాణం పోశారు. ఇక మేము ఈ సినిమా ఈ పాండమిక్ టైమ్ లో స్టార్ట్ చేసి పూర్తి చేయగలిగామంటే మా టీమ్ సపోర్ట్ వల్లే. ప్రస్తుతం విడుదల సన్నాహాల్లో ఉన్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.
దర్శకుడు విప్రా మాట్లాడుతూ.. ఇలాంటి సంక్లిష్ట సమయంలో సినిమా చేయడమనేది ఎంతో రిస్క్ తో కూడుకున్నది. మా నిర్మాత సహకారం వల్లే ఇది చేయగలిగాం. మా టీమ్ అంతా కూడా ఎంతో సహకరించారు. ముఖ్యంగా ఆదాశర్మగారి సపోర్ట్ మరువలేము. కరోనా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా సినిమా పూర్తి చేశాం. ఇక మొదట ఇందులో ఒక పాట పెట్టాలనుకున్నప్పుడు ఎలాంటి పాటైతే బావుంటుందని అంతా ఆలోచించాం. రఘు కుంచెం గారు మంచి పాటిచ్చారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తో నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు అన్నారు.
హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ...ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాలన్నీ కూడా పర్ఫార్మెన్స్ కి స్కోపున్న చిత్రాలే . అదే కోవలో ఈ సినిమాలో కూడా నటను ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాటకు శేఖర్ మాస్టర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. కరోనా టైమ్ లో స్టార్ట్ చేసి కరోనా టైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న మొదటి సినిమా మాది. సినిమా చాలా బాగా వచ్చింది. డైరక్టర్స్ ఎక్స్ లెంట్ గా డీల్ చేశారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు.
Chick Here Vedio: క్వశ్చన్ మార్క్ ? సాంగ్ లాంచ్