Advertisementt

విజయ్ దేవరకొండ కొత్త వ్యాపారం?

Fri 30th Oct 2020 04:37 PM
vijay deverakonda,invests,electric mobility  విజయ్ దేవరకొండ కొత్త వ్యాపారం?
Vijay Deverakonda Invests in Electric Mobility విజయ్ దేవరకొండ కొత్త వ్యాపారం?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి

అయ్యారు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవైేట్

లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి,

కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నగరంలో

ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్  వెహికిల్ సమిట్ లో ఈ

కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది.

వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లను

నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత

మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానికి

స్కూటర్లు, బైక్ లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి.

భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ

వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్

దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ

కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

Vijay Deverakonda Invests in Electric Mobility:

Vijay Deverakonda Invests in Electric Mobility

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ