Advertisementt

చిత్రీకరణ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ నాంది!

Thu 29th Oct 2020 05:29 PM
allari naresh,naandhi,shooting,wrapped up  చిత్రీకరణ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ నాంది!
Naandhi Shooting Wrapped Up చిత్రీకరణ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ నాంది!
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం నాంది. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిల్చొని తన బాధను వ్యక్త పరుస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తుంది అల్లరి నరేష్ నాంది సినిమాలో ఇప్పటివరకు చెయ్యని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నాడని. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఇటీవల విడుదలైన నాంది పోస్టర్ (ఫస్ట్ రివీల్ ఇంప్యాక్ట్) కు అద్భుతమైన స్పందన లభించింది. శ్రీచరన్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

తారాగ‌ణం:

అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని, గ్రిగ్నేశ్వర రావు.

Naandhi Shooting Wrapped Up:

Allari Naresh’s Naandhi Shooting Wrapped Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ