Advertisementt

'లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా'... అంటున్న కీర్తి సురేష్!!

Wed 28th Oct 2020 07:02 PM
lacha gummadi,keerthy suresh,miss india  'లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా'... అంటున్న కీర్తి సురేష్!!
'Lacha Gummadi' lyrical video song from 'Miss India' 'లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా'... అంటున్న కీర్తి సురేష్!!
Advertisement
Ads by CJ

కీర్తిసురేశ్‌ మిస్‌ ఇండియా లిరికల్‌ వీడియో సాంగ్‌

పచ్చిపచ్చి మట్టి జల్లె పుట్టుకొచ్చె ఈవేళ 

గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల

గట్టుదాటి పల్లె తేటి పాటే కట్టి పుంఖంలా

పట్టలేని పోలికలోన పడుచునవ్వె తుమ్మెదలా

మా లచ్చ గుమ్మాగుమ్మాడిరా ఓ గోగుల గుంగాడి రా.. ఈ తుమ్మెర కొప్పున సన్నజాజి నవ్వేరా...

అంటూ ఓ అమ్మాయి తన లక్ష్యం గురించి ఎలా కలగందో అందంగా పాట రూపంలో వివరించింది మిస్‌ ఇండియా యూనిట్‌. బుధవారం ఈ సినిమా నుండి మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీత సారథ్యంలో లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా.. లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఫోక్‌ సాంగ్‌ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్ నటించిన చిత్రం మిస్‌ ఇండియా. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన మిస్‌ ఇండియా నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్‌ 4న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ సినిమా విడుదలవుతుంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది

'Lacha Gummadi' lyrical video song from 'Miss India' :

'Lacha Gummadi' lyrical video song from Keerthy Suresh's 'Miss India' is out! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ