Advertisementt

శర్వానంద్ శ్రీకారం తిరుపతి షెడ్యూల్ పూర్తి!

Tue 27th Oct 2020 04:57 PM
sharwanand,sreekaram,tirupati  శర్వానంద్ శ్రీకారం తిరుపతి షెడ్యూల్ పూర్తి!
Sreekaram Tirupati Schedule Wrapped Up శర్వానంద్ శ్రీకారం తిరుపతి షెడ్యూల్ పూర్తి!
Advertisement
Ads by CJ

ఇటీవల తిరుపతిలో అక్టోబర్ 2న ప్రారంభమైన శ్రీకారం షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. షూటింగ్ లో సహకరించిన అందరూ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో షూటింగ్ అనుకున్న షెడ్యూల్ లో పూర్తి అయ్యింది. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, నరేష్, రావు రమేష్, సాయి కుమార్, సత్య, సప్తగిరి, ఆమని ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. టాకీ పార్ట్ తో పాటు దినేష్ మాస్టర్ నేతృత్వంలో ఒక సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఈ కరోన సమయంలో అందరి సహకారంతో షూటింగ్ ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగింది.

శర్వానంద్ తో జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోన్న ఈ సినిమాను కిషోర్.బి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్లాక్ బాస్టర్ గద్దలకొండ గణేష్ తరువాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో వస్తోన్న రెండో సినిమా శ్రీకారం.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్ర సంభాషణలు అందిస్తున్నారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు:

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, రావ్ రమేష్, ఆమని, నరేష్, సాయి కుమార్, మురళి శర్మ, సత్య, సప్తగిరి తదితరులు

Sreekaram Tirupati Schedule Wrapped Up:

Sharwanand's Sreekaram Tirupati Schedule Wrapped Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ