Advertisementt

వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం!

Mon 26th Oct 2020 05:55 PM
satish vegesna,koti kommachi movie,koti kommachi movie opening  వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం!
Kotikommachi Movie Opening వేగేశ్న సతీష్ 'కోతి కొమ్మచ్చి' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్నలు హీరోలుగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం  కోతి కొమ్మచ్చి . లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన  నిర్మాత దిల్ రాజు మొదటి షాట్ కి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేసారు.

 అనంతరం దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ  యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న మా చిత్రాన్ని విజయదశమి పర్వదినం రోజు ప్రారంభించడం జరిగింది. నవంబర్ 3 నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు పెడతాము. ఆ తర్వాత వైజాగ్ లో కొంత పార్ట్ షూట్ చేయబోతున్నాము. ఒకే షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము. అని తెలిపారు.

నిర్మాత ఎం ఎల్ వి సత్యానారాయణ మాట్లాడుతూ  సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. వేగేశ్న సతీష్ గారు మా బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ లకు ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం అందిస్తుందని నమ్ముతున్నాము. అన్నారు

త్వరలోనే షూటింగ్ లో పాల్గోనబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం అని కథానాయకులు మేఘమ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్న ఆకాక్షించారు. 

 రిద్ది కుమార్ , మేఘ చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనుప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Kotikommachi Movie Opening:

Satish vegesna Koti Kommachi Movie Opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ