Advertisementt

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Sun 25th Oct 2020 11:19 AM
pawan kalyan,sithara entertainments,production no 12,movie announcement  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Power Star Pawan Kalyan - Sithara Entertainments - Production No 12 Announcement పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం  

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో

యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు.  ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్. కె .చంద్ర ను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తు వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు..గబ్బర్ సింగ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్.ప్రకాష్ లు ఎంపిక అయ్యారు అని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.  పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది, చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చెబుతూ మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు  చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

Power Star Pawan Kalyan - Sithara Entertainments - Production No 12 Announcement:

Pawan Kalyan and Sithara Entertainments Production No 12 Film Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ