Advertisementt

మా వింత‌గాధ‌ వినుమ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Sat 24th Oct 2020 08:56 PM
maa vintha gadha vinuma,maa vintha gadha vinuma movie first look,allu aravind  మా వింత‌గాధ‌ వినుమ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల
Maa Vintha Gadha Vinuma First Look మా వింత‌గాధ‌ వినుమ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల
Advertisement
Ads by CJ

మా వింత‌గాధ‌ వినుమ‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌.. న‌వంబ‌ర్ 13న ఆహాలో సినిమా విడుదల

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌వుతుంది. ప్ర‌తి శుక్ర‌వారం వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆహా ఆక‌ట్టుకుంటోంది. న‌వంబ‌ర్ నెల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా న‌వంబ‌ర్ 13న మా వింత‌గాధ వినుమ చిత్రం ఆహాలో విడుద‌ల‌వుతుంది. ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంలో జోడీగా న‌టించిన సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్  ఇందులో జంట‌గా మెప్పించ‌నున్నారు. 

ఆహా ప్ర‌మోట‌ర్‌,  ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మావింత‌గాధ వినుమ‌ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత సంజ‌య్ రెడ్డి, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ‘తెలుగు ఓటీటీ యాప్‌గా ఆహా ప్ర‌తి నెల క్ర‌మంగా ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌వుతుంది. అందులో భాగంగా న‌వంబ‌ర్ 13న ఆహాలో మావింత‌గాధ వినుమ‌ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నాం. ఇది సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థ‌. మంచి ఫ‌న్ ఉంటుంది. అలాగే ఆలోచ‌న‌ను రేకెత్తిస్తుంది అన్నారు. 

తెలుగు ప్రేక్ష‌కుల అభిమాన తార‌లు న‌టించిన చిత్రాలతో పాటు క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌తో ఆహా తెలుగు ప్రేకకుల హృద‌యాల‌కు ద‌గ్గ‌రైంది. వారికి మరింత ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించే దిశ‌గా మేం ఇంకా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, జోహార్‌, ఒరేయ్ బుజ్జిగా, క‌ల‌ర్‌ఫొటో చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ఈ శుక్ర‌వారం విడుద‌లైన క‌ల‌ర్‌ఫొటో సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుద‌లై ఇర‌వై నాలుగు గంట‌లైన‌ప్ప‌టికీ ఇంకా సోష‌ల్ మీడియాలో సినిమా ట్రెండ్ అవుతుండ‌ట‌మే అందుకు నిద‌ర్శ‌నం. 

నటీనటులు:

సిద్ధు జొన్నలగడ్డ, శీరత్ కపూర్, తనికెళ్లభరణి, ప్రగతి, మంచు లక్ష్మి, శిశిర్ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, క‌మ‌ల్ కామ‌రాజు, క‌ల్పిక గ‌ణేశ్, వైవా హ‌ర్ష‌, ఫిష్ వెంక‌ట్‌, సీవీఎల్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  ఆదిత్య మండ‌ల‌, నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనీల్ ప‌ల్లాల‌, జి.సునీత‌, కార్తీ చిలుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌:  మారుతి రావు.జి, ర‌చ‌న‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ర‌వి ఆంటోని, ఎడిట‌ర్‌:  వంశీ అట్లూరి, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, మ్యూజిక్‌:  శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, రోహిత్ రాయ్‌, సినిమాటోగ్ర‌ఫీ:  సాయి ప్ర‌కాశ్ ఉమ్మ‌డిసింగు,

Maa Vintha Gadha Vinuma First Look:

Maa Vintha Gadha Vinuma Movie First Look Launch 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ