కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన చిత్రం సమాజం ప్రారంభం!
కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తోన్న మూడో సినిమా సమాజం. ఈ బ్యానర్ లో తీరం , క్రియేటివ్ క్రిమినల్ సినిమాలు తెరకెక్కాయి. దసరా పండగ సందర్భంగా సమాజం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దర్శకుడు ఎమ్ . రవి నాయక్ క్లాప్ కొట్టగా నిర్మాత నర్సింహ్మ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి నాయక్ మాట్లాడుతూ...
సమాజం చిత్రం దసరా పండగ సందర్భంగా ప్రారంభం అవ్వడం సంతోషం. మనికాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. త్వరలో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను తీసుకొని నవంబర్ మూడో వారం నుండి షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి కానుందని అన్నారు.
హీరో: మనికాంత్
నిర్మాత: నర్సింహ్మ గౌడ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎమ్.రవి నాయక్
మాటలు: మురళి రమేష్
దర్శకత్వ పర్యవేక్షణ: అలహరి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చేరుకుపల్లి రామలింగం