Advertisementt

బాలకృష్ణ నర్తనశాల ఈ నెల 24న విడుదల

Mon 19th Oct 2020 06:14 PM
balakrishna narthanashala movie,narthanashala movie,balakrishna narthanashala will be released on 24th,narthanashala movie  బాలకృష్ణ నర్తనశాల ఈ నెల 24న విడుదల
Balakrishna Narthanashala will be released on 24th బాలకృష్ణ నర్తనశాల ఈ నెల 24న విడుదల
Advertisement
Ads by CJ

 ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా నటసింహ నందమూరి బాలకృష్ణ నర్తనశాల ఈ నెల 24న విడుదల

 సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న  విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఒక శుభవార్త. 

Balakrishna Narthanashala will be released on 24th:

Balakrishna Narthanashala will be released on 24th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ