తెలుగువాడు రాసిన బుక్ ప్రపంచం చదువుతోంది!
ఇరవయ్యో శతాబ్దం చూసిన ఒక ముఖ్యమైన సంఘటన 1948 జనవరి 30న జరిగింది. మహాత్మా గాంధీని కాల్చి చంపిన ఆయుధం యొక్క పద్నాలుగు సంవత్సరాల ప్రయాణమే అమిరిశెట్టి గోపాల్ అనే నూతన రచయిత రచించిన బెరెట్టా 606824 అనే పుస్తకం. ఆ చారిత్రాత్మక ఆయుధంతో కలిసి ప్రయాణం చేసిన నేటితరం యోధుడైన జై అనే వ్యక్తి ఇందులో కథానాయకుడు. కాలచక్రంలో ప్రయాణించగలిగే అదృష్టాన్ని అతడు ఒక అధ్బుతకార్యానికి వాడాలని కలగన్నాడు. ఆ తుపాకి ఎన్నో చేతులు మారి ఇటాలీ, స్పెయిన్, అల్బేనియా, గ్రీస్, ఈజిప్ట్ మారియు ఇంకెన్నో దేశాలు దాటి చివరికి భారతదేశంలో అడుగుపెట్టింది. సహస్రాబ్దిలో ఎన్నో ఘట్టాలకి సాక్షి అయిన ఆ ఆయుధం చివరికి మహాత్మకి గురిపెట్టి భారతవాణిపై మౌనముద్ర వేసింది. ఎన్నో యుద్దాలని రసకందాయకంగా చూపించిన ఈ పుస్తకం రీడర్స్ కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. బెరెట్టా 606824 అనే పుస్తకం త్వరలో సినిమా గా కూడా రాబోతోంది.
బుక్ కోసం ఎక్కడ క్లిక్ చెయ్యండి: బెరెట్టా 606824 బుక్