Advertisementt

హైదరాబాద్ లో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చెక్!

Sat 17th Oct 2020 12:58 PM
check movie,nitin - chandrasekhar yeleti check movie,nitin check movie,  హైదరాబాద్ లో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చెక్!
Nitin - Chandrasekhar Yeleti Check Movie in Hyderabad హైదరాబాద్ లో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చెక్!
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న నితిన్ - చంద్రశేఖర్ యేలేటి - భవ్య క్రియేషన్స్ ల చిత్రం చెక్

యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం చెక్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ చెక్ టైటిల్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది అని తెలిపారు.

పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

Nitin - Chandrasekhar Yeleti Check Movie in Hyderabad:

Nitin - Chandrasekhar Yeleti Check Movie in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ