Advertisementt

ర‌వితేజ‌ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ ఆర్‌టి67 ప్రి లుక్!

Sat 17th Oct 2020 12:47 PM
ravi teja,ravi teja ramesh varma combination rt67 pre look,dierector ramesh varma,ravi teja new movie,ravi teja  ర‌వితేజ‌ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ ఆర్‌టి67 ప్రి లుక్!
Ravi Teja Ramesh Varma Combination RT67 Pre Look! ర‌వితేజ‌ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ ఆర్‌టి67 ప్రి లుక్!
Advertisement
Ads by CJ

ర‌వితేజ‌, ర‌మేష్ వ‌ర్మ‌, స‌త్య‌నారాయ‌ణ కోనేరు కాంబినేష‌న్ ఫిల్మ్ ప్రి లుక్ విడుద‌ల‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, రాక్ష‌సుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించేందుకు ప్ర‌ముఖ నిర్మాత స‌త్య‌నారాయ‌ణ కోనేరు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఆర్‌టి67 (ర‌వితేజ 67వ చిత్రం) ప్రి లుక్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్న‌ట్లున్న ర‌వితేజ షాడో ఇమేజ్‌ను మ‌నం చూడొచ్చు.

ఈ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ది. అదేరోజు ఉద‌యం 11:55 గంట‌ల‌కు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి నాయిక‌గా న‌టించే ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు.

తారాగ‌ణం: ర‌వితేజ‌, మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి.

సాంకేతిక బృందం: బ్యాన‌ర్లు: ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్‌. ప్రొడ‌క్ష‌న్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌. పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌. నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ కోనేరు. ద‌ర్శ‌కుడు: ర‌మేష్ వ‌ర్మ‌.

Ravi Teja Ramesh Varma Combination RT67 Pre Look!:

Ravi Teja Ramesh Varma Combination RT67 Pre Look!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ