Advertisementt

ఫాన్స్ కు 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కానుకగా..

Sat 17th Oct 2020 12:26 PM
radheshyam movie,prabas birthday,23ed prabas birthday,beats of radheshyam on 23rd,  ఫాన్స్ కు  23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కానుకగా..
Beats of Radheshyam on 23rd ఫాన్స్ కు 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కానుకగా..
Advertisement
Ads by CJ

 రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆక్టోబ‌ర్ 23న‌ బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్‌, యూవి క్రియెష‌న్స్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం రాధేశ్యామ్‌. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్ర‌శీద లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో న‌వ‌రాత్రులు అలానే అక్టోబ‌ర్ 23న‌ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరిట మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.  తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

 నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: చిత్ర స‌మ‌ర్ప‌కులు: రెబ‌ల్‌స్టార్ డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు. సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస. ఎడిటర్:  కొటగిరి వెంక‌టేశ్వ‌రావు. యాక్ష‌న్‌, స్టంట్స్‌: నిక్ ప‌వ‌ల్‌. సౌండ్ డిజైన్: ర‌సూల్ పూకుట్టి. కొరియోగ్ర‌ఫి: వైభ‌వి మ‌ర్చంట్‌. కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌: తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని. వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌: క‌మ‌ల్ క‌న్న‌న్. ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: ఎన్‌.సందీప్‌. హెయిర్‌స్టైల్‌‌: రోహ‌న్ జ‌గ్ట‌ప్‌. మేక‌ప్‌: త‌ర‌న్నుమ్ ఖాన్. స్టిల్స్‌: సుద‌ర్శ‌న్ బాలాజి. ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: క‌బిలాన్‌. పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను. కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌: ఆడోర్ ముఖ‌ర్జి. ప్రోడక్షన్ డిజైనర్: ర‌‌వీంద‌ర్‌. నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌శీదా. దర్శకుడు: రాధాకృష్ణ కుమార్.

Beats of Radheshyam on 23rd:

Beats of Radheshyam on 23rd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ