Advertisementt

జర్నలిస్ట్ గా బాధ్యతతో. బాధతో.. ఈ చిత్రం తీసా!

Tue 13th Oct 2020 10:51 AM
wrong gopal varma movie,wrong gopal varma traler launch,wrong gopal varma movie update,wrong gopal varma movie  జర్నలిస్ట్ గా బాధ్యతతో. బాధతో.. ఈ చిత్రం తీసా!
Wrong Gopal Varma Traler Launch జర్నలిస్ట్ గా బాధ్యతతో. బాధతో.. ఈ చిత్రం తీసా!
Advertisement
Ads by CJ
ఒక జర్నలిస్ట్ గా బాధ్యతతో.. బాధతో రాంగ్ గోపాల్ వర్మ రూపొందించాను! - రచయిత & దర్శకనిర్మాత: ప్రభు
     ఒక దర్శకుడి వింత పోకడలకు, వెర్రి చేష్టలకు విసిగిపోయి.. వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాంగ్ గోపాల్ వర్మ చిత్రాన్ని తెరకెక్కించానని పేర్కొన్నారు రచయిత-దర్శకనిర్మాత ప్రభు.
ఈ చిత్రం మోషన్ పోస్టర్, టైటిల్ సాంగ్, టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తుండగా.. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. దర్శకనిర్మాత ప్రభు, కథానాయకుడు షకలక శంకర్, ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించిన జబర్దస్త్ అభి, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్, ఛాయాగ్రాహకుడు బాబులతో పాటు.. ప్రముఖ పాత్రికేయులు వినాయకరావు, సురేష్ కొండేటి పాల్గొన్నారు. 
     జర్నలిస్ట్ గా పలు సంచనాలు సృష్టించిన ప్రభు రాంగ్ గోపాల్ వర్మ చిత్రంతో దర్శకుడుగానూ సంచలనాలకు శ్రీకారం చుట్టాలని వినాయకరావు, సురేష్ కొండేటి ఆకాక్షించారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాల్లో తనకు బాగా నచ్చిన చిత్రాల్లో రాంగ్ గోపాల్ వర్మ ఒకటని శంకర్ అన్నారు.
ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రభుకు.. సంగీత దర్శకుడు షకీల్, ఛాయాగ్రాహకుడు బాబు కృతజ్ఞతలు తెలిపారు. 
చిత్ర రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పిన ప్రభు..
ఈ చిత్రాన్ని అతి త్వరలో ఓటిటి ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు!!

Wrong Gopal Varma Traler Launch:

Wrong Gopal Varma Traler Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ