Advertisementt

పూర్ణ బ్యాక్ డోర్ ఎంట్రీ!

Mon 12th Oct 2020 09:44 PM
back door entry movie,actoress poorna,back door entry movie update,director curry balaji,back door entry movie  పూర్ణ బ్యాక్ డోర్ ఎంట్రీ!
Poorna giving back door entry! పూర్ణ బ్యాక్ డోర్ ఎంట్రీ!
Advertisement
Ads by CJ

కర్రి బాలాజీ కోసం బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ
 యువ ప్రతిభాశాలి-నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ బ్యాక్ డోర్ పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ కథానాయకి పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని.. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు (12-10-2020) లాంఛనంగా జరిగాయి.
 దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా కామన్ అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ వినూత్న చిత్రం హీరోయిన్ పూర్ణ కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది అని అన్నారు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. శర వేగంతో షూటింగ్ పూర్తి చేసేందుకు మా దర్శకుడు కర్రి బాలాజీ అన్ని సన్నాహాలు చేస్తున్నారు అని వివరించారు. చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.
 ఈ చిత్రానికి పాటలు: జావళి, సంగీతం: ప్రణవ్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, రచనాసహకారం: భూపతిరాజు రామకృష్ణ-రవి రోహిత్.జి, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ.

back door entry movie,actoress poorna,back door entry movie update,director curry balaji,back door entry movie

Poorna giving back door entry!:

Poorna giving back door entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ