Advertisementt

ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు!

Thu 08th Oct 2020 07:07 PM
apadbandhavudu movie,apadbandhavudu movie is 28 years old,chiramjeevu,  ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు!
Apadbandhavudu is 28 years old! ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు!
Advertisement
Ads by CJ
ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు!
చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రమిది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది. అలాగే  5 నంది అవార్డులు గెలుచుకున్న చిత్రం. చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది ఈ చిత్రంలోని చిరంజీవి పాత్ర. మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అలాగే ఎం ఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. కె.విశ్వనాథ్‌ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల.. ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరకి కె.విశ్వనాథ్‌ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్‌ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి, చివరి చిత్రం ఇదే .
apadbandhavudu movie,apadbandhavudu movie is 28 years old,chiramjeevu,

Apadbandhavudu is 28 years old!:

Apadbandhavudu Movie is 28 years old!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ