తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటన!
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కలిసి ఈ కరోన సమయంలో ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని గురించి చర్చించడం జరిగింది. ఈ నష్టాన్ని ఎలా అధిగమించాలనే అంశంపై సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశాల సారాంశంను త్వరలో తెలుపుతాము. ఒక సానుకూల వాతావరణంలో జరిగే ఈ చర్చలకు అందరూ పాజిటీవ్ గా స్పందిస్తున్నారని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ మరియు కార్యదర్శులు టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల తెలిపారు.
కరోన కారణంగా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదివరకు జరిగిన నష్టానికి ఎలా అధిగమించాలి, ఎవరెవరు ఏ త్యాగాలు చెయ్యాలి అనే అంశంపై అన్ని శాఖల వారు చర్చిస్తున్నారని వారు తెలిపారు.