Advertisementt

విజయ్ - సుక్కు.. ఊహించని కాంబో సెట్టయ్యింది!!

Mon 28th Sep 2020 12:18 PM
vijay deverakonda,sukumar,sensational combo,film announced  విజయ్ - సుక్కు.. ఊహించని కాంబో సెట్టయ్యింది!!
Sensational Combo: Vijay Deverakonda, Sukumar విజయ్ - సుక్కు.. ఊహించని కాంబో సెట్టయ్యింది!!
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసిన యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన కేదార్ భవిష్యత్ లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్  డైరెక్టర్ సుకుమార్ లతో చేయబోతున్నట్టు తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్.నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్ల తో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి.విజయ్ ,సుకుమార్ లిద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కుడా అలాగే ఉంటాయి.వాళ్ళిద్దరి కలయిక లో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం. అని అన్నారు.

Sensational Combo: Vijay Deverakonda, Sukumar:

Vijay Deverakonda, Sukumar Film Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ