Advertisementt

కుటుంబ బంధాల నేపథ్యంలో జిఎల్‌బి సినిమా

Tue 29th Sep 2020 07:58 AM
glb cinema,movie,family emotions,movie,launch  కుటుంబ బంధాల నేపథ్యంలో జిఎల్‌బి సినిమా
GLB Cinema New movie Launched కుటుంబ బంధాల నేపథ్యంలో జిఎల్‌బి సినిమా
Advertisement
Ads by CJ

కుటుంబ బంధాలు, ఆస్తితగాదాలు వీటికి క్రైమ్ కథని మిళతం చేస్తూ జిఎల్‌బి సినిమా నిర్మాణ సంస్థ కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. తేజేశ్వర్ రెడ్డి, కల్యాణ్, స్పందన ప్రకాష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిపై ఆదివారం హైదరాబాద్‌లో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. వెంకటేశ్ ఆర్ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటివారం నుండి హైదరాబాద్, కర్నూలు ప్రాంతాల్లో జరుగుతుందని నిర్మాత జిఎల్‌బి . శ్రీనివాస్ తెలిపారు. ఈ సినిమాలో నాలుగు పాటలుంటాయని చెప్పారు. ‘‘నేటి సమాజంలో ఆస్తి కోసం తల్లిదండ్రులను సైతం చంపేందుకు వారసులు వెనుకాడటం లేదు. అలాగే వారసత్వంగా పిల్లలకు పంచాల్సిన ఆస్థులను పెద్దలు సకాలంలో ఇవ్వడం లేదు. దీంతో పిల్లల్లో అసహనం పెరుగుతోంది. పర్యావసానాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ  అంశాలను చేర్చుతూ మా సినిమా తెరకెక్కిస్తున్నాం’’ అని నిర్మాత వివరించారు.

‘‘కథలో కొత్తదనం ఉంది. అన్ని తరాలకి కనెక్ట్ అయ్యే సినిమా’’ అని దర్శకుడు చెప్పారు.

ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని హీరో హీరోయిన్లు తెలిపారు.

ఈ చిత్రంలో తేజేశ్వర్ రెడ్డి, కల్యాణ్, స్పందన ప్రకాష్, రిక్షత, వెంకటేష్ తాతిరాజు, చంటి గోడాలి, కమ్మరి రాజు, గుండమల్ల శ్యామ్ ప్రసాద్, జయ సంపత్, నవల్ కిషోర్, అగర్వాల్, శీలం శ్రీను నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేందర్ రెడ్డి, పాటలు, సంగీతం: రమేష్ గౌడ్ పంజాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పూర్ణచందర్ రావు తోట, రచన సహకారం: శ్రీనివాసరావు తుమ్మల, ప్రొడక్షన్ మేనేజర్: కొండపాక కనకయ్య, సహ నిర్మాత: విజయ భారతి మురపాక, నిర్మాత: జిఎల్ బి. శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకటేష్ ఆర్ సుందర్.

GLB Cinema New movie Launched:

GLB Cinema movie in Family Emotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ