Advertisementt

‘దిశ ఎన్‌కౌంటర్’ ట్రైలర్: వర్మ దించేశాడుగా!!

Sun 27th Sep 2020 06:15 PM
ram gopal varma,disha encounter,movie,trailer,release,update  ‘దిశ ఎన్‌కౌంటర్’ ట్రైలర్: వర్మ దించేశాడుగా!!
Disha Encounter movie Trailer released ‘దిశ ఎన్‌కౌంటర్’ ట్రైలర్: వర్మ దించేశాడుగా!!
Advertisement
Ads by CJ

రాం గోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ ట్రైలర్ విడుదల... నవంబర్ 26న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల

గతేడాది హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దిశ ఎన్‌కౌంటర్’. ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. సుమారు 02:44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌... నవంబర్‌ 26 ఉదయం 6:10 గంటలకు ప్రారంభం అవుతుంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్‌ చేసి... వెహికిల్ కోసం ఎదురు చూస్తున్న వెటర్నరీ డాక్టర్ దిశపై అక్కడే ఉన్న నలుగురు లారీ డ్రైవర్ల కన్ను పడుతుంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్కూటీని పంచర్‌ చేస్తారు. సాయం కోసం రోడ్డు మీద నిల్చున్న దిశను కిడ్నాప్‌ చేసి... లారీలో తీసుకెళ్తారు. ఆమెను దారుణంగా రేప్‌ చేసి.. అనంతరం మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి తగలబెడతారు. ఇది జరుగుతున్న సమయంలో ఓ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అక్కడి నుంచి వెళ్లడం... శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పోలీస్ కాల్పులలో మరణించిన ఘటనతో ఈ సినిమా పూర్తవుతుంది. ‘దిశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌ నాటి ఘటనను కళ్లకు కడుతుంది.

ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనురాగ్‌ కంచర్ల నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 26 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అనురాగ్ కంచర్ల తెలిపారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, ప్రవీణ్ రాజ్, నవీన్ బోనం, కళ్యాణ్ వీరమల్ల, ముని మాయదారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కళ్యాణ్ సమీ, ఆర్ట్ డైరెక్టర్ జి.సందీప్ కుమార్, సంగీతం డి. ఎస్. ఆర్., సౌండ్ ఎఫెక్ట్ శేషు కుమార్, పి.ఆర్.ఓ. మధు వి.ఆర్.

Disha Encounter movie Trailer released:

Disha Encounter movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ