నిశ్శబ్దం సినిమా షూటింగ్ 56 రోజులలో పూర్తి!
తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థ్రిల్లర్ నిశ్శబ్దం సినిమా యొక్క గ్లోబల్ ప్రీమియర్ మరొక్క 5 రోజులు ఉండటంతో, ఈ సందర్భంగా మాట్లాడుతూ, దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రం యొక్క మొత్తం చిత్రీకరణకు 56 రోజులు మాత్రమే పట్టిందని వెల్లడించారు! అంతేకాకుండా, ఈ చిత్రం మొత్తం వాషింగ్టన్‌లోని సీటెల్ నేపథ్యంలో నిజమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది - షూట్‌ల కోసం సెట్‌లు వెయ్యలేదు అని తెలిపారు.
ఈ చిత్రం మొత్తం అమెరికాలోని సీటెల్ శివార్లలోని నిజమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది. అన్ని నిజమైన ప్రదేశాలలో, సహజమయిన లొకేషన్లలో చిత్రీకరించాము. మేము సెట్స్ వెయ్యలేదు, ఈ చిత్రంలో చూపించిన కొంతమంది పోలీసుల పాత్రలలో కొంతమంది నిజమైన పోలీసులను ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి బోర్డు మీదకు తీసుకుని వెళ్ళాము. మొత్తం సినిమాను 56 రోజుల్లో రెండు భాషల్లో పూర్తి చేశాము - ఒకేసారి తమిళం మరియు తెలుగు భాషలలో షూటింగ్ పూర్తి చేసాము. అని ఆయన వెల్లడించారు.
చెవిటి మరియు మూగ లక్షణాలున్న సాక్షి ఒక ప్రతిభావంతులైన కళాకారిణి యొక్క కధే ఈ నిశ్శబ్దం చిత్రం. ఖ్యాతి గడించిన ఒక విల్లాలో ఒక విషాద సంఘటనను అనుకోకుండా చూసినప్పుడు ఆమె నేర పరిశోధనలో చిక్కుకుంటారు. పోలీసు డిటెక్టివ్ల బృందం కేసు దిగువకు చేరుకోవటానికి నిశ్చయించుకుంది మరియు దెయ్యం నుండి తప్పించుకున్న యువతి వరకు అనుమానితుల జాబితాతో సాగే సంఘటనలతో నిశ్శబ్దం చిత్రం ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని హామీ ఇచ్చారు, ఇది ప్రేక్షకులను అనుక్షణం ఉత్కంఠతో చివరివరకు మంచి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్ధం చిత్రానికి టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు మరియు ఆర్ మాధవన్, అనుష్క శెట్టి మరియు అంజలి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మైఖేల్ మాడ్సెన్ యొక్క భారత అరంగేట్రం కావడం విశేషం మరియు అంజలి, శాలిని పాండే, సుబ్బరాజు మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో నటించారు.
భారతదేశంలో మరియు 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ సభ్యులు 2020 అక్టోబర్ 2 న విడుదల అవుతున్న నిశ్శబ్దం చిత్రాన్ని తెలుగు (సైలెన్స్ పేరుతో తమిళ, మళయాళ) భాషల్లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.