Advertisementt

నితిన్ ‘రంగ్ దే’ టీమ్ కూడా స్టార్ట్ చేశారు

Thu 24th Sep 2020 05:38 PM
nithiin,rangde,shooting update,resumed,nithiin movie,keerthi suresh  నితిన్ ‘రంగ్ దే’ టీమ్ కూడా స్టార్ట్ చేశారు
Nithiin RangDe Shoot Resumed నితిన్ ‘రంగ్ దే’ టీమ్ కూడా స్టార్ట్ చేశారు
Advertisement
Ads by CJ

నితిన్ ‘రంగ్ దే’ పునః ప్రారంభం

యువ కథానాయకుడు నితిన్, మహానటి కీర్తి సురేష్‌ల తొలి కాంబినేషన్‌లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమయింది. షూటింగ్‌కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం ఈరోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. ‘ప్రేమ’తో కూడిన కుటుంబ కథా చిత్రం ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.  

నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే: సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ; రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Nithiin RangDe Shoot Resumed:

Nithiin RangDe Film Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ